Hyderabad Rave Party: హైదరాబాద్‌లో మళ్లీ పట్టుబడిన డ్రగ్స్.. పోలీసుల అదుపులో సినీ నిర్మాత సహా పలువురు ప్రముఖులు..
Hyderabad Rave Party: రేవ్ పార్టీల్లో చిందులు, తైతక్కలు.. అటెనక బ్లూ రీల్స్.. జిగేల్ జిగేల్ మనే లైట్లలో చీకటి పనులు.. పట్టాణాల్లో ఇలాంటి మత్తు కథా చిత్రాలు ఎన్నో ఎన్నెన్నో.. నిత్యం ఇలాంటి అసభ్యకర పార్టీల గబ్బు కొడుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ మహా నగరంలోని మాదాపూర్‌లో మరో డ్రగ్ కహానీ వెలుగు చూసింది. గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. విఠల్‌రావ్‌నగర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్స్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు.. అటాక్ చేశారు.
రేవ్ పార్టీల్లో చిందులు, తైతక్కలు.. అటెనక బ్లూ రీల్స్.. జిగేల్ జిగేల్ మనే లైట్లలో చీకటి పనులు.. పట్టాణాల్లో ఇలాంటి మత్తు కథా చిత్రాలు ఎన్నో ఎన్నెన్నో.. నిత్యం ఇలాంటి అసభ్యకర పార్టీల గబ్బు కొడుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ మహా నగరంలోని మాదాపూర్‌లో మరో డ్రగ్ కహానీ వెలుగు చూసింది. గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. విఠల్‌రావ్‌నగర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్స్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు.. అటాక్ చేశారు. పార్టీని భగ్నం చేశారు. ఆ పార్టీలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు అధికారులు. భారీగా కొకైన్, ఎల్‌ఎస్‌డీ స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలో సినీ నిర్మాత వెంకట్ తో సహా, ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రేవ్ పార్టీ వ్యహారంపై దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఆటోనగర్ సూర్య, పూల రంగడు, లవ్లీ, ఢమరుకం తదితర సూపర్ హిట్ సినిమాలకు ఫైనాన్షియర్ గా వ్యవహరించారు వెంకట్.
ఇటీవల టాలీవుడ్ లో వరుసగా డ్రగ్స్ జాడలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కబాలి తెలుగు నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో పట్టు బట్టాడు. అతనితో పాటు పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలోనే మరోసారి టాలీవుడ్ నిర్మాత డ్రగ్స్ తో పట్టుబడడం సంచలనంగా మారింది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
