పెళ్లయి రెండు నెలలే.. భర్త టైం ఇవ్వడం లేదని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ షాకింగ్ నిర్ణయం

హైదరాబాద్‌ మూసాపేటలో 25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని చందనాజ్యోతి మృతి విషాదాన్ని నింపింది. భర్త తనకు తగినంత సమయం కేటాయించడం లేదనే మనస్తాపంతో ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లయి రెండు నెలలే.. భర్త టైం ఇవ్వడం లేదని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ షాకింగ్ నిర్ణయం
Woman Software Employee

Updated on: Oct 01, 2026 | 5:04 PM

హైదరాబాద్: మూసాపేటలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. భర్త తనకు సరిగా సమయం కేటాయించడం లేదనే మనస్తాపంతో చందనాజ్యోతి (25) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన చందనాజ్యోతికి ఆగస్టులో వెంకటసాయి యశ్వంత్‌తో వివాహమైంది. ఉద్యోగ రీత్యా ప్రస్తుతం వీరిద్దరూ హైదరాబాద్‌లోని మూసాపేటలో నివాసముంటున్నారు.

చందనాజ్యోతి ఇంటి వద్ద నుంచే వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తుండగా, భర్త ఆఫీస్‌కు వెళ్లేవాడు. భర్త తనకు తగినంత సమయం కేటాయించడం లేదని ఆమె తరచూ అతనితో గొడవపడేది. ఈ క్రమంలోనే.. తీవ్ర మనస్తాపానికి గురైన చందనాజ్యోతి శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యంలోనే ఆమె మృతిచెందింది.

కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.. క్షణికావేశంలో ఇలాంటి దారుణ నిర్ణయాలు తీసుకోవద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. ఆత్మహత్య ఆలోచనలు లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు సాయం కోసం 14416 నంబర్‌కు (టెలీ మానస్ – Tele MANAS) ఫోన్ చేయవచ్చు. లేదా.. పోలీసులు, మానసిక వైద్యుల సాయం కూడా తీసుకోవచ్చు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us