Almond Cashew: సగం ధరకే జీడిపప్పు.. బాదం.. హోమ్‌ డెలివరీ.. ఫేస్‌బుక్‌ వేదికగా మోసగాళ్ల నయా దందా..!

|

Jun 20, 2021 | 7:22 AM

Almond Cashew: సైబర్‌ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని ఉపయోగించి మోసగాళ్లు అమాయకులను నట్టేట ముంచుతున్నారు. జీడి పప్పు కిలో రూ.500,.

Almond Cashew: సగం ధరకే జీడిపప్పు.. బాదం.. హోమ్‌ డెలివరీ.. ఫేస్‌బుక్‌ వేదికగా మోసగాళ్ల నయా దందా..!
Follow us on

Almond Cashew: సైబర్‌ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని ఉపయోగించి మోసగాళ్లు అమాయకులను నట్టేట ముంచుతున్నారు. జీడి పప్పు కిలో రూ.500, బాదం కిలో రూ.300.. మీ ఫోన్‌ నెంబర్‌, చిరునామా చెబితే కేవలం రెండు గంటల్లో ఇంటికి తీసుకువచ్చి ఇస్తామంటూ సైబర్‌ నేరస్థులు ఫేస్‌బుక్లో ప్రకటనలు చేస్తున్నారు. వీటితో పాటు ఖర్జూరం, అవిసెగింజలు, తృణ ధాన్యాలను జనాలు ఆకట్టుకునే కవర్లపై ముద్రించి 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తామని, ఆర్డర్‌ చేసిన మొత్తంలో 50శాతం ముందుగానే చెల్లిస్తే రెండు గంటల్లో హోమ్‌ డెలివరి చేస్తామటూ ప్రకటనలో పేర్కొన్నారు. కనీసం ఆర్డర్‌ రెండు వేలు ఉండాలంటూ సూచించడంతో వందలాది మంది ఇలాంటి డ్రైఫ్రూట్స్‌ కావాలంటూ సైబర్‌ నేరస్థులకు ఫోన్‌లు చేస్తున్నారు. ఇక వారు సూచించిన బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయగా, తర్వాత నేరగాళ్లు వారి ఫోన్లు స్విచ్ఛాప్‌ చేసేస్తున్నారు.

షాక్‌కు గురైన కస్టమర్లు ఈ విషయాన్ని పోలీసులకు తెలుపడంతో రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ సైబర్‌ నేరస్థులే ఈ మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఫేస్‌బుక్‌, ఫేస్‌బుక్‌ మార్కెట్ ప్లేస్‌లో ప్రకటనలు పోస్టు చేస్తున్న వారిలో 95 శాతం వీరే ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రముఖ బ్రాండ్లకు ధీటుగా మెల్టింగ్‌ హార్ట్స్‌ పేరుతో రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. గత సంవత్సరం సంపూర్ణ లాక్‌డౌన్‌ ఉన్న సమయంలో ఇంటికే మద్యం పంపిణీ చేస్తామంటూ ప్రముఖ మద్యం దుకాణాల పేర్లతో ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి మోసాల నుంచి తప్పించుకోవాలంటే హోమ్‌ డెలివరీ ఇచ్చేటప్పుడు మొత్తం నగదు ఇస్తామంటూ నిందితులకు చెప్పాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇవీ కూాాడా చదవండి:

Homeremedies For Cough: దగ్గు వేధిస్తోందా.. వంటింటిలో ఉన్న పదార్ధాలతో తగ్గించుకోవచ్చు అంటున్న ఆయుర్వేదం.. ఆ చిట్కాలు ఏమిటంటే

Dandruff: ఎన్ని షాంపూలు వాడినా చుండ్రు స‌మ‌స్య త‌గ్గ‌ట్లేదా.? ఈ టిప్స్ పాటించండి.. మంచి ఫలితం ఉంటుంది.