Omicron effect: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కఠిన ఆంక్షలు.. పకడ్బందీగా స్ర్కీనింగ్‌ పరీక్షలు..

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. తాజాగా మన దేశంలోనూ రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదుకావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Omicron effect: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కఠిన ఆంక్షలు.. పకడ్బందీగా స్ర్కీనింగ్‌ పరీక్షలు..
Follow us

|

Updated on: Dec 03, 2021 | 11:33 AM

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. తాజాగా మన దేశంలోనూ రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదుకావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం కర్ణాటకలో ఒమిక్రాన్ వేరియంట్ రెండు కేసులు బయపడిన సంగతి తెలిసిందే . కాగా ఇప్పటివరకు సుమారు 30 దేశాలలో ఈ వేరియంట్‌ని గుర్తించారని సమాచారం. ఈ క్రమంలో కొత్త వేరియంట్ను కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాలు కఠిన నిబంధనలు, ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కాగా ఒమిక్రాన్‌ ప్రభావంతో హైద‌రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త రకం వైరస్‌ బయటపడిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో పకడ్బందీగా స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, బోట్సువానా, ఇజ్రాయెల్, హాంకాంగ్, బెల్జియం తదితర దేశాల నుంచే వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్ర్కీనింగ్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు.

కాగా ఒమిక్రాన్ ప్రభావం ఉన్న దేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులకు నెగెటివ్ వచ్చినా ఏడు రోజుల పాటు క్వారంటైన్‌ తప్పనిసరి చేస్తున్నారు. అదేవిధంగా వీరి ట్రావెల్ హిస్టరీని కూడా ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది సేకరిస్తున్నారు. ఇక ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేసి నెగెటివ్‌ వచ్చిన తర్వాతే బయటకు పంపుతున్నారు. అదేవిధంగా వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే డొమెస్టిక్‌ అరైవల్స్‌కు విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు. వీరికి థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. కాగా ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం నాలుగు నుంచి ఆరు గంటల సమయం పడుతోంది. ఇందుకోసం విమానాశ్రయం లోపల మూడు జోన్లలో స్ర్కీనింగ్‌ టెస్ట్‌ ఏర్పాట్లు చేశారు. పెద్ద మొత్తంలో వైద్య, ఆరోగ్య సిబ్బందితో కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Also Read:

Omicron variant: విస్తరిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్.. ఏ దేశంలో ఎన్ని కేసులు ఉన్నాయంటే..

Omicron: ఒమిక్రాన్ గురించి పూర్తిగా తెలిసేది అప్పుడే.. టేకిటీసీ పాలసీ ముప్పు తెస్తుంది..బ్రిటన్ శాస్త్రవేత్త హెచ్చరిక!

Omicron Variant: భారత్ లోకి ఎంటరైన ఒమిక్రాన్.. బెంగళూరులో రెండు కేసులు నమోదు..

జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు