Hyderabad: మండపంలో షాకింగ్ సీన్.. కళ్లముందే ప్రియురాలి పెళ్లి.. ప్రియుడు ఏం చేశాడంటే..?

ప్రియురాలి పెళ్లి జరుగుతున్న మండపకానికి వెళ్లి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదారబాద్‌ (Hyderabad) లోని లంగర్ హౌజ్‌లో సోమవారం జరిగింది.

Hyderabad: మండపంలో షాకింగ్ సీన్.. కళ్లముందే ప్రియురాలి పెళ్లి.. ప్రియుడు ఏం చేశాడంటే..?
Wedding Hall

Updated on: Jul 04, 2022 | 5:39 PM

Boyfriend commits suicide: పెళ్లి మండపంలో ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ప్రియురాలికి పెళ్లి జరుగుతుందని మనస్తాపం చెందిన ప్రేమికుడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ప్రియురాలి పెళ్లి జరుగుతున్న మండపకానికి వెళ్లి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదారబాద్‌ (Hyderabad) లోని లంగర్ హౌజ్‌లో సోమవారం జరిగింది. తాను ప్రేమించిన యువతి మరో వ్యక్తితో పెళ్లి చేసుకోడాన్ని జీర్ణించుకోలేని ప్రియుడు ఏకంగా.. మండపానికి వెళ్లి పెట్రోల్‌ పోసుకొని కాల్చుకున్నాడు. శరీరానికి మంటలంటుకున్నా.. అంతటితో ఆగకుండా వధువు వైపు పరుగులు తీశాడు. మంటలతోనే ఆమెను హత్తుకున్నాడు.

వెంటనే అలెర్ట్‌ అయిన బంధువులు వధువును పక్కకు జరిపారు. వధువుకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే తీవ్రగాయాలపాలైన ప్రియుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వధువు కూడా స్వల్పగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us