Telangana: ఎవరు ప్రలోభపెట్టారు? ఏం ఆశ చూపించారు? ఎంత ఆఫర్‌ చేశారు.. ఉత్కంఠ రేపుతున్న వ్యవహారం..

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కొనుగోలు సినిమాకు శివారులోని మొయినాబాద్‌లో...

Telangana: ఎవరు ప్రలోభపెట్టారు? ఏం ఆశ చూపించారు? ఎంత ఆఫర్‌ చేశారు.. ఉత్కంఠ రేపుతున్న వ్యవహారం..
Telangana Mlas
Follow us

|

Updated on: Oct 27, 2022 | 11:50 AM

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కొనుగోలు సినిమాకు శివారులోని మొయినాబాద్‌లో ఓ ఫాం హౌస్‌ వేదిక అయింది. టైమ్‌, షెడ్యూల్‌ ఫిక్స్‌ అయింది. స్క్రీన్‌ ప్లే ప్రకారం అంతా సెట్‌లోకి వచ్చారు. కొంతసేపటి తరువాత పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే ఎమ్మెల్యేలతో ఆ ముగ్గురి మంతనాలు అయిపోయాయి. గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్ధవర్ధన్‌ రెడ్డి, రోహిత్‌ రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతో సోదాలు చేశామన్నారు. ఈ వ్యవహారాన్ని నడిపిన రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌ అని చెప్పారు. ముగ్గురిని రాత్రి 10 గంటల సమయంలో అరెస్ట్‌ చేశామని స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. ఎమ్మెల్యేల సమాచారం మేరకు పక్కాగా ప్లాన్‌ వేసిన పోలీసులు కూలీలు, చిన్న వ్యాపారులు, ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ వేషాల్లో నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. అంతా ఫామ్‌హౌజ్‌లోకి చేరుకున్నాక డబ్బు సంచులు వచ్చాయని ఎమ్మెల్యేలు సమాచారమిచ్చాక ఒక్కసారిగా చేసి అరెస్ట్‌ చేశారు.

ఢిల్లీ ఫరీదాబాద్‌ ఆలయంలో ఉండే రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ వీరితో సంప్రదింపులు జరిపినట్లు తేలింది. ఫాం హౌస్‌లో రామచంద్ర భారతితో పాటు తిరుపతికి చెందిన స్వామీజీ సింహయాజి, హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌మెన్‌ నంద కుమార్‌ ఉన్నారు. నందకుమారే వీళ్లను ఫాం హౌస్‌కి తీసుకొచ్చి ప్రలోభపెడుతున్నట్లు సమాచారం అందిందన్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో నలుగురు ఎమ్మెల్యేలు రెండు కార్లలో మొయినాబాద్‌లోని ఫాం హౌస్‌కు చేరుకున్నారు. వ్యక్తిగత సహాయకులు, భద్రతా సిబ్బంది లేకుండా ఎమ్మెల్యేలు సొంతంగానే వాహనాలు నడుపుకుంటూ వచ్చారు.

ఆ తర్వాత కొద్ది సేపటికి నందకుమార్‌, సింహయాజి, రామచంద్రభారతి ముగ్గురు కలిసి ఒకే కారులో ఫాం హౌస్‌కు చేరుకున్నారు. సాయంత్రం 6.30 సమయంలో ఎస్‌వోటీ, మొయినాబాద్‌ పోలీసులు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సాయంత్రం 6.45 ప్రాంతంలో శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ ఏసీపీ కూడా ఫాం హౌస్‌కు వచ్చారు. రాత్రి 7.50 కు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు రూపొందించిన భారీ ఆపరేషన్‌ భగ్నమైందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆ తరువాత కొన్ని నిమిషాలకే ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రోహిత్‌రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌ రెడ్డి కలిసి ఉన్న వీడియోలు, నందకుమార్‌, సింహయాజి, రామచంద్రభారతి ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. సరిగ్గా 8 గంటల సమయంలో సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఫాంహౌస్‌కి చేరుకున్నారు. నిమిషాల వ్యవధిలోనే కుట్రను వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

రాత్రి 10 గంటల తర్వాత నందకుమార్‌, సింహయాజి, రామచంద్రభారతిలను అరెస్టు చేశారు. రాత్రి 10.40 సమయంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పోలీసు వాహనంలో ఫాంహౌస్‌ నుంచి వెళ్లిపోయారు. తరువాత మరో వాహనంలో మిగతా ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. మరో వైపు ఫౌంహౌస్‌లో ఓ పక్కన పార్క్‌ చేసి ఉన్న TS 07-H -2777 కారు వెనుక సీట్లో రెండు బ్యాగ్‌లను గుర్తించారు. అందులో డబ్బు ఉన్నట్టు సమాచారం. కానీ పోలీసులు అందులో ఏముంది అన్నది వెల్లడించలేదు. మరో వైపు ఈ కారు గంధవరపు దిలీప్‌కుమార్‌ పేరుతో ఉన్నట్టు గుర్తించారు. ఈ వాహనంపై ఓవర్‌స్పీడ్‌ కేసులో 3 చలాన్లకు 3,105 రూపాయలు జరిమానా ఉంది.

అయితే సోదాల్లో ఎంత డబ్బు పట్టుబడిందన్నది పోలీసులు వెల్లడించలేదు. ఎమ్మెల్యేలకు నగదు ఇచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర చెబుతున్నారు. ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఆడియో టేపులు ఉన్నాయని చెబుతున్నా అవి మాత్రం బహిర్గతం కాలేదు. సంచలనం రేపిన ఈవ్యవహారంపై సైబరాబాద్‌ పోలీసులు ఇవాళ మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఎవరు ప్రలోభపెట్టారు? ఏం ఆశ చూపించారు? ఎంత ఆఫర్‌ చేశారు. తెర వెనుక ఉన్న వ్యక్తులెవరో చెప్పాలంటూ మీడియా ఎమ్మెల్యేలను ప్రశ్నించగా మాట్లాడేందుకు నిరాకరించారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అరాచకాలు జరగనివ్వబోమని, దేశంలో జరుగుతున్న దుర్మార్గాలను కేసీఆర్‌ నాయకత్వంలో ఎండగడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తామన్నారు ఎమ్మెల్యేలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో