Telangana: కోకాపేట్‌లో విషాదం.. హాస్టల్ గదికి వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగ ప్రభాకర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతస్తుల భవనం పై నుండి కిందికి దూకి బలవన్మరణం పాల్పడ్డాడు. పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Telangana: కోకాపేట్‌లో విషాదం.. హాస్టల్ గదికి వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
Software Engineer Committed Suicide

Updated on: Oct 25, 2024 | 7:55 AM

రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట్లో విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగ ప్రభాకర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 7 అంతస్తుల భవనం పై నుండి కిందికి దూకి బలవన్మరణం పాల్పడ్డాడు. హుటాహుటిన సంఘటన స్థలానికి  నార్సింగీ పోలీసులు చేరుకున్నారు.  మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు.

ఆంద్రప్రదేశ్‌కు చెందిన నాగ ప్రభాకర్ గచ్చిబౌలిలోని ఓ కంపనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాడు. కోకాపేట్‌లో హాస్టల్ గదికి వచ్చి నాగ ప్రభాకర్ తనువు చాలించాడు. నాగ ప్రభాకర్ ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు తెలుసుకొంటున్నారు. పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు దర్యాప్తు చేస్తున్న వీడియో ఇదిగో: