Hyderabad: ఓఆర్ఆర్‌పై బొలేరోను ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి వ్యక్తి సజీవదహనం!

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ శివారులోని ఔటర్ రింగురోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు రోడ్డుపై ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఢీ కొట్టంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. కారులో ఉన్న వ్యక్తి ఆ మంటల్లో సజీవ దహనమయ్యాడు. మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు.

Hyderabad: ఓఆర్ఆర్‌పై బొలేరోను ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి వ్యక్తి సజీవదహనం!
Accident

Updated on: May 10, 2025 | 9:18 AM

రెండు వాహనాలు ఢీకొని మంటల్లో ఓ వ్యక్తి సజీవదహనం అయిన సంఘటన హైదరాబాద్‌ శివారులోని పెద్ద అంబర్‌ పేట్‌లో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ శివారులోని ఔటర్ రింగురోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. అతివేంగా వచ్చిన ఓ కారు రోడ్డుపై ఆగి ఉన్న బొలేరో వాహానాన్ని ఢీకొట్టినట్టు తెలుస్తోంది. కారు బొలేరో వాహనాన్ని ఢీకొట్టిన వెంటనే రెండు వాహనాల్లో మంటలు చెలరేగాయి. దీంతో కార్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు కారులోనే సజీవదహనం అయ్యాడు.

అయితే ప్రమాదాన్ని గమనించి ఘటనా స్థలాని చేరుకున్న స్థానికులు కారులో చిక్కుకున్న మరో వ్యక్తిని రక్షించారు. వెంటనే చికిత్స నిమిత్తం అతన్ని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రోడ్డు అడ్డంగా ఉన్న రెండు వాహనాలను క్రేన్‌ సహాయంతో అక్కడి నుంచి తొలగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us