భార్యను చంపాడు.. మరో పెళ్లి చేసుకున్నాడు.. సీన్‌కట్ చేస్తే.. 3 నెలల తర్వాత అసలు కథ బయటపడింది..

|

Sep 27, 2023 | 12:41 PM

ఆమె బ్యాంకు అకౌంట్లో డబ్బులు ఉండటమే పాపమైంది.. రూ.50 వేలు కావాలంటూ పెళ్లాన్ని దారుణంగా కొట్టాడు.. దీంతో ఆమె మరణించింది. అయితే, సాధారణ మరణం అంటూ అందరినీ నమ్మించాడు.. ఖననం కూడా పూర్తయింది.. కానీ, మూడు నెలల తర్వాత తండ్రి చేసిన దురాఘతానికి సంబంధించి కూతురు చెప్పడంతో.. అసలు దారుణం వెలుగులోకి వచ్చింది.

భార్యను చంపాడు.. మరో పెళ్లి చేసుకున్నాడు.. సీన్‌కట్ చేస్తే.. 3 నెలల తర్వాత అసలు కథ బయటపడింది..
Crime News
Follow us on

ఆమె బ్యాంకు అకౌంట్లో డబ్బులు ఉండటమే పాపమైంది.. రూ.50 వేలు కావాలంటూ పెళ్లాన్ని దారుణంగా కొట్టాడు.. దీంతో ఆమె మరణించింది. అయితే, సాధారణ మరణం అంటూ అందరినీ నమ్మించాడు.. ఖననం కూడా పూర్తయింది.. కానీ, మూడు నెలల తర్వాత తండ్రి చేసిన దురాఘతానికి సంబంధించి కూతురు చెప్పడంతో.. అసలు దారుణం వెలుగులోకి వచ్చింది. డబ్బుల కోసం భార్యను భర్త దారుణంగా కొట్టి చంపిన ఘటన హైదరాబాద్‌ నగరంలోని రహమత్ నగర్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగిన మూడు నెలల తర్వాత కూతురు.. అమ్మను నాన్నే చంపాడంటూ చెప్పడంతో బంధవులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారణం..

షేక్ సలీమ్ – ఫర్జానా బేగం భార్యాభర్తలు.. ఈ దంపతులకు13 ఏళ్ల బాలిక ఉంది. రహమత్ నగర్‌లో నివాసముంటున్నారు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం ఫర్జానా (38) మరణించింది. సాధారణ మరణంగా సలీం చెప్పడంతో.. బంధువులు అంతా నమ్మారు. చివరకు బాలిక తన తల్లి ఫర్జానా మరణానికి తండ్రే కారణమంటూ పోలీసులను ఆశ్రయించింది. తన తల్లి ఫర్జానా బేగంను తన తండ్రి షేక్ సలీమ్ కర్రతో కొట్టాడని, దీంతో జూన్ 15వ తేదీ రాత్రి ఆమె అక్కడికక్కడే మరణించిందని బాలిక పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు మధురా నగర్ పోలీసులు సోమవారం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, ఫర్జానా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

మసీదు గడ్డలోని తమ ఇంట్లో రూ.50 వేలకుపైగా గొడవ జరగడంతో సలీమ్ తన తల్లిని కర్రతో కనికరం లేకుండా కొట్టాడని బాలిక పోలీసులకు తెలిపింది. “మా నాన్న మా అమ్మ బ్యాంకు ఖాతాలో జమ చేసిన డబ్బు కావాలని కోరుతున్నాడు.. ఈ సమయంలో తీవ్ర వాగ్వివాదం జరిగింది. దీంతో ఆమెను కొట్టాడు. మా అమ్మ గుండె సంబంధిత సమస్యలతో, అధిక రక్తపోటుతో బాధపడుతోంది. దాడి కారణంగా, ఆమె స్పృహతప్పి పడిపోయింది.. నోటి నుంచి నురుగు వచ్చింది..” అని బాలిక పోలీసులకు చెప్పింది.

ఫర్జానా అపస్మారక స్థితిలో ఉండడంతో బాలిక వెంగల్‌రావు నగర్‌లో నివసించే అత్తకు ఫోన్ చేసి చెప్పింది. ఆమె ఇంటికి చేరుకునే సమయానికి ఫర్జానా మృతి చెందినట్లు మధురానగర్ పోలీసులు తెలిపారు. జూన్ 16 ఉదయం సలీమ్ ఫర్జానా మృతదేహాన్ని కామారెడ్డిలోని ఆమె సోదరి ఇంటికి తరలించాడు. అక్కడ ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

భార్యను కొట్టి చంపిన సలీమ్, తన పిల్లలను విడిచిపెట్టి, మరొక మహిళను వివాహం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అయితే, భార్యను కొట్టి చంపిన సలీమ్ కోసం గాలిస్తున్నామని.. ఫర్జానా మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..