గ‘మ్మత్తు’ సౌండ్‌ వినిపించట్లేదా సార్.. బ్రాండ్‌ హైదరాబాద్‌ పరువు తీస్తున్నారు..!

హైదరాబాద్‌ చాలా డెవలప్‌ అయింది. ఏం కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది. సినిమాలో డైలాగే అయినా ఇదే నిజం. కావాలంటే చూడండి. దేశంలో ఎక్కడో ఓ చోట డ్రగ్స్‌ దొరకుతాయి. తీగ లాగితే హైదరాబాద్‌తో లింక్‌లు బయటపడతాయి. ఆ రాష్ట్రాల పోలీసులు సీక్రెట్‌ ఆపరేషన్‌ చేసి, మెరుపుదాడులు చేస్తారు. నిందితులను అరెస్ట్ చేసి పట్టుకెళ్లిపోతారు. మరి తెలంగాణ అధికారులు ఏం చేస్తున్నట్టు? బ్రాండ్‌ హైదరాబాద్‌ పరువు పోవట్లా?

గ‘మ్మత్తు’ సౌండ్‌ వినిపించట్లేదా సార్.. బ్రాండ్‌ హైదరాబాద్‌ పరువు తీస్తున్నారు..!
Hyderabad Drugs Bust

Updated on: Sep 10, 2025 | 9:50 PM

దేశంలో ఎక్కడో ఓ చోట డ్రగ్స్‌ దొరకుతాయి. తీగ లాగితే హైదరాబాద్‌తో లింక్‌లు బయటపడతాయి.  మొన్న మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు వచ్చి.. డ్రగ్స్‌ ఫ్యాక్టరీని సీజ్‌ చేయడంతో దేశం మొత్తం షాక్. పట్టుబడిన విలువ 12వేల కోట్లు. అదే పెద్ద షాకింగ్‌ అనుకుంటే.. దేశవ్యాప్తంగా హైదరాబాద్‌ నుంచే సప్లై అవుతోందన్న ట్యాగ్‌లైన్‌ ఒకటి. చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికిందట. అలా లేదూ.. తెలంగాణ అధికారుల తీరు! మెరికల్లాంటి సిబ్బందిని ఇచ్చి, దానికోసం స్పెషల్‌ ఫండ్‌ ఇచ్చి, దానికి ‘ఈగల్’ అని పేరు పెట్టి, డ్రగ్స్‌ మూలాలను ఏరిపారేయండని చెబితే.. ఏం చేస్తున్నారు? పబ్బుల్లో తనిఖీలు, ఫామ్‌హౌస్‌లలో పార్టీలపై దాడులు. చాలా…! వీటిపై ఫోకస్‌ చేస్తే డ్రగ్స్‌ను కంట్రోల్ చేసినట్లేనా? పైగా.. దానికే ఆహా, ఓహో అంటూ డప్పులు. జరగాల్సింది అది కాదు కదా! పర్మిషన్స్‌ తీసుకున్నారా, లైసెన్స్ ఉందా, రెన్యువల్స్‌ సంగతేంటి.. ఇంత వరకేనా అధికారుల డ్యూటీ? అందుకేనా యంత్రాంగం కన్నుగప్పి డ్రగ్స్‌ మాఫియా రెచ్చిపోతోంది? ఇంత నిద్రమత్తులో ఉన్నారు కాబట్టే.. IVF పేరుతో పసిపిల్లలను అమ్మింది సృష్టి ఫెసిలిటీ డాక్టర్ నమ్రత. నిర్మొహమాటంగా ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చేయొచ్చేమో.. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కంట్రోల్‌పై అధికారులు చేతులెత్తేశారు అని. దాని వెనక ఉన్న కొన్ని కేస్‌ స్టడీస్‌ పరిశీలిస్తే అర్థమవుతోంది..! ”తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ భూభాగంలో ఒక్క గంజాయి మొక్క మొలిచినా.. డ్రగ్స్‌తో రాష్ట్రంలోకి ఎవరు ప్రవేశించినా.. ఇకపై ఈగల్‌ చూస్తుంటుంది. శిక్షణ పొందిన...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి