Viral Video: ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ స్థాయిలో మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. విదేశాల నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి ఏకంగా రూ.24.5 కోట్ల విలువైన 4.9 కేజీల కొకైన్‌ను సీజ్ చేశారు డీఆర్ఐ అధికారులు. సదరు ప్రయాణికుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

Viral Video: ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా..
Cocaine Capsules Hidden In Chocolate Boxes At Hyderabad

Updated on: Sep 30, 2026 | 8:02 PM

తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం, పోలీసులు కొత్త విధానాలను అమలు చేస్తుంటే.. కొందరు కేటుగాళ్లు మాత్రం.. అక్రమంగా రాష్ట్రంలోకి మత్తుపదార్థాలను సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఇలానే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.24.5 కోట్ల విలువైన కొకైన్‌ను సీజ్ చేశారు డీఆర్ఐ అధికారులు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి విదేశాల నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌‌పోర్టుకు చేరుకున్న ఓ ప్రయాణికుడి దగ్గర ఈ భారీ మొత్తంలోని కొకైన్ పట్టుబడింది. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తుండగా.. సదరు ప్రయాణికుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన డీఆర్ఐ అధికారులు.. అతన్ని ఆపి చెక్ చేయగా.. క్యాబిన్ బ్యాగేజీలో ఏడు డార్క్ చాక్లెట్ డబ్బాలు కనిపించాయి.

అయితే వాటిని ఓపెన్ చేసి చూడగా.. అందులో చాక్లెట్లతో పాటు 207 కొకైన్ క్యాప్సూల్స్ ఉన్నట్టు గుర్తించారు అధికారులు. పట్టుబడిన కొకైన్ మొత్తం సుమారు 4.9 కేజీలు ఉందని… బహిరంగ మార్కెట్‌లో ఈ కొకైన్ విలువ రూ.24.5 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు తెలిపారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు ఘటనపై కేసు నమోదు చేసి.. ఈ రాకెట్ వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us