వధువును తీసుకొచ్చేందుకు వెళ్తుండగా ప్రమాదం.. ముగ్గురి మృతి.. పెళ్ళి ఆగిందని వరుడి తాత ఆత్మహత్య

భాజా భజంత్రీల నడుమ శుభకార్యం జరగాల్సిన ఇంట విషాదం నెలకొంది. అంగరంగ వైభవంగా వివాహం జరిగిన పెళ్లిఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి..తెల్లవారితే పెళ్లి జరుగుతుందని భావించిన ఆ కుటుంబం ఇప్పుడు కల్యాణ మండపంలో కాకుండా, ఆస్పత్రిలో కొందరు తమ బంధువుల మృతదేహాల వద్ద మరికొందరు, క్షతగాత్రుల వద్ద మరికొందరు పడిగాపులు కాస్తున్నారు.

వధువును తీసుకొచ్చేందుకు వెళ్తుండగా ప్రమాదం.. ముగ్గురి మృతి.. పెళ్ళి ఆగిందని వరుడి తాత ఆత్మహత్య
Groom’s Family Hit By Tragedy
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Mar 28, 2024 | 11:32 AM

భాజా భజంత్రీల నడుమ శుభకార్యం జరగాల్సిన ఇంట విషాదం నెలకొంది. అంగరంగ వైభవంగా వివాహం జరిగిన పెళ్లిఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి..తెల్లవారితే పెళ్లి జరుగుతుందని భావించిన ఆ కుటుంబం ఇప్పుడు కల్యాణ మండపంలో కాకుండా, ఆస్పత్రిలో కొందరు తమ బంధువుల మృతదేహాల వద్ద మరికొందరు, క్షతగాత్రుల వద్ద మరికొందరు పడిగాపులు కాస్తున్నారు. మెదక్‌ జిల్లా అందోల్‌ మండలం మాన్‌సాన్‌పల్లి శివారు మూలమలుపు వద్ద నిన్న పెళ్లి ట్రాక్టర్‌ బోల్తా పడిన ఘటనలో వరుడు తరుఫున బంధువులు ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో చిన్నారులతో సహా మరో 20 మంది గాయపడ్డారు.

మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన సుంద పోచయ్య-శ్యామమ్మ కుమారుడు రాములుకు, సంగారెడ్డి జిల్లా అందోల్‌కు చెందిన పూజారి యాదయ్య కుమార్తెతో గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే బుధవారం బంధువులంతా వచ్చేశారు. ఇంట్లో పెళ్లి సందడి నెలకొనగా.. వారి ఆచారం ప్రకారం పతానం కార్యక్రమం జరిపేందుకు అంతా సిద్ధమయ్యారు. వధువును, వరుడి ఇంటికి తీసుకువచ్చేందుకు సుమారు 30 మంది పెళ్ళికొడుకు తరఫు బంధువులు ట్రాక్టర్‌లో పెళ్లి కూతురు గ్రామానికి బయలుదేరారు. కాగా మార్గమధ్యలో సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం మన్‌సాన్‌పల్లి శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా కొట్టడంతో బాచారం గ్రామానికి చెందిన రావుగారి బూదమ్మ, జెట్టిగారి సంగమ్మ స్పాట్ లోనే చనిపోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రావుగారి ఆగమ్మ చనిపోయారు. చిన్నారులతో సహా మరో 25 మంది గాయపడ్డారు. ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రెండేళ్ల చిన్నారితో సహా పలువురు చిన్నారులూ గాయపడటంతో ఆ ప్రాంతం అంతా రోదనలతో నిండిపోయింది. పెండ్లి కుమారుని అమ్మమ్మ, చిన్నమ్మకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. బంధువులు ప్రమాదంలో చనిపోవడంతో నేడు జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. మరో వైపు పెళ్లి ఆగిందన్న మనస్తాపంతో వరుడి తాత పెంటయ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…