Gajwel: సాకారమైన గజ్వేల్‌ వాసుల కల.. నేటి నుంచి కూత పెట్టనున్న తొలి గూడ్స్‌ రైలు..

Gajwel: గజ్వేల్‌ వాసుల ఎన్నో ఏళ్ల రైలు కల నిజమైంది. నేటి నుంచి (సోమవారం) గజ్వేల్‌లో రైలు రాకపోకలు ప్రారంభంకానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్‌ ప్రత్యేక...

Gajwel: సాకారమైన గజ్వేల్‌ వాసుల కల.. నేటి నుంచి కూత పెట్టనున్న తొలి గూడ్స్‌ రైలు..
Gajwel
Narender Vaitla

|

Jun 27, 2022 | 9:54 AM

Gajwel: గజ్వేల్‌ వాసుల ఎన్నో ఏళ్ల రైలు కల నిజమైంది. నేటి నుంచి (సోమవారం) గజ్వేల్‌లో రైలు రాకపోకలు ప్రారంభంకానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిసారించడంతో రైల్వే ప్రాజెక్ట్‌ సాకరమైంది. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి వరకు దాదాపు 151 కిలో మీటీర్ల పొడవునా రూ. 1160.47 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును చేపట్టారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు మనోహరాబాద్ నుంచి గజ్వేల్‌ మండలం కొడకండ్ల వరకు సుమారు 43 కిలోమీటర్ల మార్గం పూర్తయింది. అధికారులు ఇప్పటికే మూడుసార్లు మార్గాన్ని పరీక్షించి ఓకే చెప్పారు.

దీంతో నేటి నుంచి అధికారికంగా గజ్వేల్‌కు తొలి గూడ్స్‌ రైలు రానుంది. గజ్వేల్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఎరువుల రేక్‌ పాయింట్‌కు అనుసంధానంగా ఈ రైలు సరకు రవాణా చేస్తుంది. మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి గూడ్స్‌ రైలుకు ఆహ్వానం పలకనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి 12 బోగీలతో వచ్చే ఈ తొలి గూడ్స్‌ రైలులో 11 మెట్రిక్‌ టన్నుల ఎరువులు రానున్నాయని అధికారులు తెలిపారు. ఇందుకోసం గజ్వేల్‌ రైల్వే స్టేషన్‌లో స్వాగత ఏర్పాట్లు చేశారు. ఈ గూడ్స్‌ రైలు ద్వారా ఎరువుల కొరత తీరనుందని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu