Telangana: నువ్వింకా బతికే ఉన్నావా? అంటూ రైతును చూసి అవహేలన.. MROపై సస్పెన్షన్ వేటు!

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ తహసీల్దార్ వ్యవహారశైలిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఓ రైతు సమస్యను పరిష్కరించాల్సింది పోయి, అతనితో దురుసుగా ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఘటనపై విచారణ జరిపిన రెవెన్యూ డివిజనల్ అధికారి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా .. MROను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Telangana: నువ్వింకా బతికే ఉన్నావా? అంటూ రైతును చూసి అవహేలన.. MROపై సస్పెన్షన్ వేటు!
Gajwel Tahsildar Suspended

Updated on: Oct 11, 2026 | 10:59 AM

రైతు పట్ల దురుసుగా ప్రవర్తించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్‌పై తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులు.. ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు అతన్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్వర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక గ్రామానికి చెందిన ఓ రైతు భూసమస్యపై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లారు.. అయితే అక్కడి వచ్చిన రైతును చూసి తహసీల్దార్ చిట్టంపల్లి స్వామి హేళన చేశారు.

రైతును చూసి నవ్వుతూ.. హేయ్‌ బతికే ఉన్నావా?.. నువ్వు పురుగుల మందు తాగలేదా?.. అంటూ కామెంట్ చేశారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతు.. చచ్చిపోతున్నాం సర్‌.. మా పరిస్థితి చూస్తే నవ్వు వస్తుందా? అని ప్రశ్నించారు. దీని బదులిస్తూ.. అవును నవ్వు వస్తది.. బరాబర్‌ వస్తది అంటూ తహసీల్దార్ మరోసారి అహంకారపూరితంగా సమాధానం ఇచ్చారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు.. తహసీల్దార్ స్వామి తీరుపై సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

దానికి తోడు ఎమ్మార్వో రైతు పట్ల దురుసుగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. జిల్లా కలెక్టర్‌ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ జరిపిన రెవెన్యూ డివిజనల్ అధికారి కలెక్టర్‌కు ప్రాథమిక నివేదికను సమర్పించారు. ఆ రిపోర్టు ఆధారంగా విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉద్యోగి ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా నిర్ధారణ అవ్వడంతో కలెక్టర్ అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us