
కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అవినీతి చేశారని కాంగ్రెస్ యాగీ చేస్తున్నప్పుడూ ఇంత రియాక్షన్ ఇవ్వలేదు. కేసీఆరే లక్ష్యంగా కమిషన్‌ను నియమించినప్పుడూ ఇంత ఫైర్ అవలేదు. రిపోర్ట్ బయటికొచ్చాక సైతం ఈస్థాయిలో ఆగ్రహజ్వాల బయటపడలేదు. కేసీఆర్‌ను కమిషన్ ముందుకు రప్పించినప్పుడూ ఒక్కమాట మాట్లాడలేదు. ఉన్నట్టుండి ఏంటీ బ్లాస్టింగ్? తన తండ్రిపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించారన్న ఆగ్రహమా? తనపైనా ఇవే తరహా కుట్రలు చేశారన్న బాధనా? జాగ్రత్తగా గమనిస్తే.. కవిత పార్టీ తరపున మాట్లాడినట్టుగా లేదు. పార్టీతో తాడోపేడో తేల్చుకోవాలన్నట్టుంది. దీనికి కాస్త సెంటిమెంట్ రగిలిస్తూ.. తండ్రిపై సీబీఐ విచారణకు ఆదేశించారన్న భావోద్వేగమూ కనిపించింది. లేకపోతే.. పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని అనడంతోనే.. కవిత ఎంతకైనా తెగించినట్టు అర్థమైపోతోంది. కేసీఆర్ అనుంగ సహచరుడుగా, దశాబ్దాలుగా కేసీఆర్‌తో పాటే నడుస్తున్న సంతోష్‌రావు మీద.. కేసీఆర్ రాజకీయ చరిత్రలో, కేసీఆర్ వ్యవహారాల్లో కీలక భూమిక పోషిస్తున్న హరీష్‌రావు మీద అత్యంత తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు కవిత. ఆరోపణలు చేయడం కాదు.. నేరుగా పార్టీలో చిచ్చుపెట్టారు కూడా. హరీష్‌రావు, సంతోష్‌రావు పేర్లను చాలా గట్టిగా ప్రస్తావించిన కవిత.. కేటీఆర్ విషయంలోనే ఇంకా మౌనంగా ఉన్నారనుకోండి, అది వేరే విషయం. కవిత స్టేట్‌మెంట్స్ ఎలా ఉన్నాయంటే.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అప్పటి ఇరిగేషన్ మినిస్టర్‌గా ఉన్న హరీష్‌రావు అవినీతి చేశారని కవిత నేరుగా, బహిరంగంగా చెప్పినట్టే. కవిత చేసన ఈ కామెంట్లతో.. ఇన్నాళ్లుగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు కవిత బలం...