Harish Rao: స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రధానం చేసి కేంద్ర మంత్రి.. అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు..

|

Jan 12, 2024 | 12:10 PM

తెలంగాణలో సిద్దిపేటకు ఒక ప్రత్యేకత ఉంది. టూరిజం కేంద్రంగా కూడా విస్తరిస్తోంది. సరికొత్తగా నిర్మించిన పార్కులు పొరుగు జిల్లాల నుంచి కూడా వచ్చి సేద తీరేందుకు చోటు కల్పిస్తున్నాయి. అలాంటి సిద్దిపేటకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు వరించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు 2023 ప్రకారం లక్ష కంటే ఎక్కువ జనాభా కలిగి ఉండి పరిశుభ్రంగా ఉన్న నగరాల జాబితాలో హైదరాబాద్ తొమ్మిదవ స్థానాన్ని సాధించింది.

Harish Rao: స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రధానం చేసి కేంద్ర మంత్రి.. అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు..
Siddipet
Follow us on

తెలంగాణలో సిద్దిపేటకు ఒక ప్రత్యేకత ఉంది. టూరిజం కేంద్రంగా కూడా విస్తరిస్తోంది. సరికొత్తగా నిర్మించిన పార్కులు పొరుగు జిల్లాల నుంచి కూడా వచ్చి సేద తీరేందుకు చోటు కల్పిస్తున్నాయి. అలాంటి సిద్దిపేటకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు వరించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు 2023 ప్రకారం లక్ష కంటే ఎక్కువ జనాభా కలిగి ఉండి పరిశుభ్రంగా ఉన్న నగరాల జాబితాలో హైదరాబాద్ తొమ్మిదవ స్థానాన్ని సాధించింది. తొమ్మిదో ర్యాంకుతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పారిశుధ్యంలో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందింది. 1 లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న తెలంగాణా నగరం ఫైవ్ స్టార్ సర్టిఫికేషన్ పొందడం ఇదే మొదటి సారి. గురువారం న్యూఢిల్లీలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, జిల్లా ప్రతినిధులు అవార్డులు అందుకున్నారు. 50,000 నుంచి లక్షల జనాభా కలిగిన విభాగంలో దక్షిణ భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా సిద్దిపేట జాతీయ అవార్డును గెలుచుకుంది. మొత్తం 4,443 స్థానిక సంస్థలను కవర్ చేస్తూ ఏప్రిల్ 2022, మార్చి 2023 మధ్య నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ అవార్డులు ప్రధానం చేశారు. ఈ తాజా సర్వే ప్రకారం, జీహెచ్ఎంసీ స్కోర్ సర్వీసెస్‌లో 51 శాతం, సర్టిఫికేషన్‌లో 26 శాతం, పీపుల్స్ వాయిస్ కాంపోనెంట్‌లలో 23 శాతంగా వర్గీకరించబడింది.

2015లో 275వ స్థానంలో ఉన్న నగరం పరిశుభ్రతలో టాప్ 10 ర్యాంకుల్లోకి రావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలోని జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ అవార్డును ప్రదానం చేశారు. సిద్దిపేటకు అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్ రావు నగరవాసులను, అధికారులను అభినందించారు. ఎవరు సహకరించకుండా ఉంటే సిద్దిపేట దక్షిణ భారతదేశంలోనే పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొంది ఉండేది కాదన్నారు. దీని వెనుక అధికారులు, ప్రజల కృషి ఉందని కొనియాడారు. సిద్దిపేటలో చెత్త సేకరణ, నిర్మూలన వ్యవస్థలు, పరిశుభ్రత పనులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని హరీశ్‌రావు అన్నారు. ఇది సిద్దిపేట ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..