Fishing on roads: మరోమారు తెలంగాణలో రోడ్లమీదే చేపల వేట.. ఈ సారి ఒక్కోటి 5 కిలోలు పై మాటే..

వ‌ర‌ద నీటిలో చేప‌లు కొట్టుకురావ‌డంతో వాటిని పట్టుకునేందుకు జ‌నం ప‌రుగులు పెట్టారు. వలలు, చీరలతో రోడ్లపైనే చేప‌ల‌ను ప‌ట్టుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు.

Fishing on roads: మరోమారు తెలంగాణలో రోడ్లమీదే చేపల వేట.. ఈ సారి ఒక్కోటి 5 కిలోలు పై మాటే..
Adb Fish

Updated on: Jul 13, 2022 | 12:57 PM

తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో నిర్మల్ జిల్లా కేంద్రం మొత్తం నీట మునిగిపోయింది. వ‌ర‌ద నీరు నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోకి చేర‌డంతో రోడ్ల‌న్ని జ‌ల‌మ‌యం అయ్యాయి. వ‌ర‌ద నీటిలో చేప‌లు కొట్టుకురావ‌డంతో వాటిని పట్టుకునేందుకు జ‌నం ప‌రుగులు పెట్టారు.

వలలు, చీరలతో రోడ్లపైనే చేప‌ల‌ను ప‌ట్టుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. నిర్మల్‌ పట్టణంలోని మంజులపూర్‌ చెరువుకు గండిపడింది. దీంతో చెరువులోని నీరంతా పట్టణంలోని రోడ్లు వీధులవెంట ప్రవహిస్తోంది. వరద నీటిలో చేపలు భారీగా కొట్టుకుపోతున్నాయి.

ఒక్కో చేప బరువు సుమారు 5 కిలోలకు మించి బరువున్నాయి. రోడ్లపై చేపలు దొరకుతున్న విషయం తెలిసి.. జనం వాటి కోసం ఎగబడ్డారు. ఎది దొకిరితే అది చేతబట్టుకుని చేపల వేట సాగించారు. కొందరు మత్స్యకారులు రోడ్లమీద, ఇంటి వాకిట్లోనే వలలు వేసిన చేపలు పట్టారు. దొరికినవారు ఎంచక్కా వాటిని సంచిలో వేసుకుని ఇంటికి తీసుకెళ్లారు. నిర్మల్ రోడ్లపై చేపల వేటకు సంబంధించిన వీడియోలు మరోమారు స్థానికులతో పాటు, నెటిజన్లను సైతం ఊరిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us