ఎండిపోతున్న ప్రాజెక్టులు.. తరుముకొస్తున్న కరువు.. నవంబర్ అన్నదాతను ఆదుకుంటుందా..?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వర్షాభావ పరిస్థితులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్న వేళ రెండు రాష్ట్రాల్లోనూ సగటున 25 నుంచి 30 శాతానికి పైగా వర్షపాతం లోటు నమోదైంది. ఏపీలో 388 మండలాలు, తెలంగాణలో 365 మండలాలను ప్రభుత్వాలు ఇప్పటికే కరువు ప్రాంతాలుగా ప్రకటించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అడుగంటిన జలాశయాలు, పడిపోయిన భూగర్భ జలాలు రైతన్నను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చేతికొచ్చిన పైరును ఎలా కాపాడుకోవాలి? నవంబర్ వానలపై ఆధారపడొచ్చా? రబీలో అన్నదాతలు వేయాల్సిన అడుగులేంటి? అనేది తెలుసుకుందాం..

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. తరుముకొస్తున్న కరువు.. నవంబర్ అన్నదాతను ఆదుకుంటుందా..?
Will November Rains Save Farmers Standing Crops

Edited By:

Updated on: Oct 31, 2026 | 9:54 PM

వానాకాలం ముగిసిపోతోంది. పంటలు చేతికొచ్చే సమయం దగ్గరపడుతోంది. కానీ చాలా ప్రాంతాల్లో పొలాల్లో తేమ లేదు. చెరువుల్లో నీళ్లు తగ్గుతున్నాయి. బోర్లలో నీటి మట్టం పడిపోతోంది. వాన కోసం ఆకాశం వైపు చూసిన రైతుకు ఇప్పుడు నవంబర్ ఒక్కటే ఆశగా కనిపిస్తోంది. ఈ ఏడాది వర్షాలు సరిగా పడకపోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఒకవైపు పంటలు ఎండిపోతుంటే, మరోవైపు రబీ సాగు ఎలా చేయాలన్న బెంగ పట్టుకుంది. అక్టోబర్ 30 నాటికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ గణాంకాలు చూస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. తెలంగాణలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. సాధారణంగా 829.9 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా, 623.1 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అంటే 206.8 మిల్లీమీటర్ల లోటు ఉంది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే 25 శాతం తక్కువ వర్షం పడింది. ఈ లెక్కలు చూస్తే రెండు రాష్ట్రాల్లోనూ సగటున నాలుగో వంతు నుంచి మూడో వంతు వరకు వర్షం తగ్గిందని తెలుస్తోంది. అయితే రాష్ట్ర సగటు ఒక్కటే మొత్తం పరిస్థితిని చెప్పదు. కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వాన పడితే, మరికొన్ని జిల్లాల్లో చినుకు కూడా కరువైంది. ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు సాధారణంగా...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి