పొలం గట్టుపై పొలిటికల్ వార్.. పిచ్చెక్కిస్తున్న పార్టీల లడాయి.. తెలంగాణలో ‘రైతే రాజు’కీయం!

జూన్ 2 తెలంగాణ రాష్ట్రానికి 12వ పుట్టినరోజు. ఆవిర్భావ వేడుకలు ఊరూవాడా అట్టహాసంగా ముగిశాయి. రాజకీయ పార్టీలైతే సంబరాలతో పాటు పనిలో పనిగా చిచ్చుబుడ్లు కూడా వెలిగించుకున్నాయి. పాత చిచ్చులను కొత్తగా వెలిగించుకుని, ఆ మంటల నుంచి చలి కాచుకుంటున్నాయి. ఒక పార్టీపై మరొకటి, ఇష్యూ బేస్‌డ్‌గా చురకలంటించుకుని, చిత్తశుద్ధిని లెక్కలేసుకుంటున్నాయి. ముఖ్యంగా మూడు ప్రధాన అంశాలు మూడు పార్టీల మధ్య దూరాన్ని బాగా పెంచేశాయి. విచిత్రం ఏంటంటే, ఆ మూడూ రైతుకు సంబంధించిన టాపిక్‌లే. నాగలి పట్టకపోయినా, దుక్కి దున్నకపోయినా, సాగు చెయ్యకపోయినా, పార్టీ కండువాలేసుకుని రైతు సంక్షేమం కోసం వీళ్లు పడే పాట్లు చూస్తే, ఔరా అనిపిస్తోంది.

పొలం గట్టుపై పొలిటికల్ వార్.. పిచ్చెక్కిస్తున్న పార్టీల లడాయి.. తెలంగాణలో ‘రైతే రాజు’కీయం!
Telangana Farmers Politics

Updated on: Jun 03, 2026 | 9:50 PM

జూన్ 2 తెలంగాణ రాష్ట్రానికి 12వ పుట్టినరోజు. ఆవిర్భావ వేడుకలు ఊరూవాడా అట్టహాసంగా ముగిశాయి. రాజకీయ పార్టీలైతే సంబరాలతో పాటు పనిలో పనిగా చిచ్చుబుడ్లు కూడా వెలిగించుకున్నాయి. పాత చిచ్చులను కొత్తగా వెలిగించుకుని, ఆ మంటల నుంచి చలి కాచుకుంటున్నాయి. ఒక పార్టీపై మరొకటి, ఇష్యూ బేస్‌డ్‌గా చురకలంటించుకుని, చిత్తశుద్ధిని లెక్కలేసుకుంటున్నాయి. ముఖ్యంగా మూడు ప్రధాన అంశాలు మూడు పార్టీల మధ్య దూరాన్ని బాగా పెంచేశాయి. విచిత్రం ఏంటంటే, ఆ మూడూ రైతుకు సంబంధించిన టాపిక్‌లే. నాగలి పట్టకపోయినా, దుక్కి దున్నకపోయినా, సాగు చెయ్యకపోయినా, పార్టీ కండువాలేసుకుని రైతు సంక్షేమం కోసం వీళ్లు పడే పాట్లు చూస్తే, ఔరా అనిపిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌‌లో తెలంగాణ ఆవిర్బావ వేడుకలు… జాతీయ జెండా ఎగరేసి రాష్ట్ర గీతాలాపనలో గొంతు కలిపారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రభుత్వం అంటే నలుగురి చేతుల్లో పెత్తనం కాదు, నాలుగు కోట్లమంది ప్రజలిచ్చిన ప్రాతినిధ్యం, అందుకే బాధ్యతగా పని చేస్తున్నామని, ఇకపై ఇంతకు మించి చేస్తామని తనకు తాను కర్తవ్యబోధ చేసుకున్నారు. 2023 డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండున్నరేళ్ల జమానా పూర్తి చేసుకుంది. ఈ 30 నెలల్లో ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చడంలో సక్సెస్ అయ్యామని చెప్పుకుంటోంది. పదేళ్ల పాటు...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి