ప్రాణంగా చూసుకునే అన్నకే చెల్లెలి మార్ఫింగ్ ఫోటోలు.. నమ్మించి నట్టేట ముంచిన కాలేజ్ ఫ్రెండ్!

ప్రేమ పేరిట నమ్మించి, ఆపై మనస్పర్థలు రావడంతో ప్రియురాలి నగ్న చిత్రాలను ఆమె అన్నకే పంపి, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ఓ కాలేజీ విద్యార్థి ఉదంతం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చాకచక్యంగా వ్యవహారించిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 

ప్రాణంగా చూసుకునే అన్నకే చెల్లెలి మార్ఫింగ్ ఫోటోలు.. నమ్మించి నట్టేట ముంచిన  కాలేజ్ ఫ్రెండ్!
Boyfriend Blackmailing Girlfriend

Updated on: May 30, 2026 | 12:47 PM

ప్రేమ పేరిట నమ్మించి, ఆపై మనస్పర్థలు రావడంతో ప్రియురాలి నగ్న చిత్రాలను ఆమె అన్నకే పంపి, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ఓ కాలేజీ విద్యార్థి ఉదంతం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చాకచక్యంగా వ్యవహారించిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్‌కు చెందిన బాధితురాలు, నిందితుడు ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. అయితే, ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య కొన్ని గొడవలు జరిగాయి. దీంతో కక్ష పెంచుకున్న నిందితుడు, బాధితురాలికి సంబంధించిన కొన్ని ఫోటోలను మార్ఫింగ్ చేశాడు. అంతటితో ఆగకుండా, ఆ మార్ఫ్ చేసిన ఫోటోలను బాధితురాలి అన్న మొబైల్‌కు పంపి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు.

విషయం తెలిసిన బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి న్యాయం కోసం మొదట నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. అయితే, సాంకేతిక కారణాల వల్ల అక్కడ కేసు నమోదు కాలేదు. దీంతో వారు వెంటనే జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. బాధితుల పరిస్థితిని అర్థం చేసుకున్న జవహర్‌నగర్ పోలీసులు తక్షణమే స్పందించి, పరిధిని పక్కనబెట్టి ‘జీరో FIR’ నమోదు చేశారు. అనంతరం కేసును తదుపరి విచారణ నిమిత్తం మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

కేసును స్వీకరించిన మేడ్చల్ పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. యువతిని వేధించినందుకు, మార్ఫింగ్ ఫోటోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినందుకు అతడిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్పుడు మార్గంలో ఉపయోగించి యువతుల జీవితాలతో ఆడుకుంటే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us