Big News Big Debate: తెలంగాణలో పార్లమెంట్‌ దంగల్‌.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు

తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల వేడి.. పతాకస్థాయికి చేరింది. ప్రధానపార్టీలు పదునెక్కిన వ్యూహాలతో రణక్షేత్రంలోకి దిగిపోయాయి. దీంతో రాష్ట్ర రాజకీయం సెగలు గక్కుతోంది. ఓవైపు కాంగ్రెస్‌.. మరోవైపు బీజేపీ.. ఇంకోవైపు బీఆర్‌ఎస్‌.. వరుస సభలతో హోరెత్తిస్తున్నాయి. ఎవరి టార్గెట్‌ వాళ్లదే.. మరి, ఈ ట్రయాంగిల్‌ ఫైట్‌లో మెజార్టీ ఎంపీ స్థానాలు ఎవరు గెలుస్తారన్నదే ఇప్పుడు ఆసక్తిరేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ..

Big News Big Debate: తెలంగాణలో పార్లమెంట్‌ దంగల్‌.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు
Big News Big Debate
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Mar 13, 2024 | 4:10 PM

తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల వేడి.. పతాకస్థాయికి చేరింది. ప్రధానపార్టీలు పదునెక్కిన వ్యూహాలతో రణక్షేత్రంలోకి దిగిపోయాయి. దీంతో రాష్ట్ర రాజకీయం సెగలు గక్కుతోంది. ఓవైపు కాంగ్రెస్‌.. మరోవైపు బీజేపీ.. ఇంకోవైపు బీఆర్‌ఎస్‌.. వరుస సభలతో హోరెత్తిస్తున్నాయి. ఎవరి టార్గెట్‌ వాళ్లదే.. మరి, ఈ ట్రయాంగిల్‌ ఫైట్‌లో మెజార్టీ ఎంపీ స్థానాలు ఎవరు గెలుస్తారన్నదే ఇప్పుడు ఆసక్తిరేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌.. పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతుంటే.. పట్టుకోల్పోకుండా చూసుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోంది. అధికారం దూరమై డీలాపడిన బీఆర్‌ఎస్‌.. తగ్గేదేలె అన్నట్టుగా ఎన్నికలపోరుకు సన్నద్ధమవుతోంది. ఒకే రోజున మూడు పార్టీలు ఏర్పాటు చేసిన బహిరంగసభలు.. పొలిటికల్‌గా హీట్‌ను మరింత పెంచేశాయి.ఎలాగైనా ఈసారి గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో అగ్రనేతల్ని ప్రచార రంగంలోకి దింపుతోంది బీజేపీ. అందులో భాగంగానే రాష్ట్రానికి వచ్చిన అమిత్‌ షా.. పార్టీనేతలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం జరిగిన బహిరంగసభలో.. అటు, కాంగ్రెస్‌ ఇటు బీఆర్‌ఎస్‌లపై నిప్పులు చెరిగారు.

అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. అదే జోష్‌తో ముందుకెళ్తామంటోంది. మహిళాశక్తి పేరిట బహిరంగసభను ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లను టార్గెట్‌ చేశారు. రాష్ట్రంలో అధికారం మిస్సయినా.. పార్లమెంట్‌లో పాగా వేస్తామంటోంది బీఆర్‌ఎస్‌. బీఎస్పీతో పొత్తు కన్ఫామ్‌ చేసుకుని.. కాంగ్రెస్‌, బీజేపీలకు ధీటుగా.. పదునైన వ్యూహాలతో ముందుకెళ్తోంది. కరీంనగర్‌లో కదనభేరి పేరిట లక్షమందితో భారీ బహిరంగసభను నిర్వహించింది గులాబీపార్టీ. నల్గొండ సభ తర్వాత మరోసారి పబ్లిక్‌లోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. ప్రత్యర్థులపై తనదైన స్టయిల్‌లో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల వేడికి తోడు.. నేతల వలసలు కూడా రాష్ట్ర రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే భారీసంఖ్యలో సిట్టింగ్‌ ఎంపీలతో పాటు, మాజీలు సైతం.. బీజేపీ కండువా కప్పేసుకున్నారు. వలస నేతల్నే బలంగా భావిస్తున్న బీజేపీ హైకమాండ్‌… వారిలో చాలామందికి టిక్కెట్లు కూడా కన్ఫామ్‌ చేసేసింది. బీఆర్‌ఎస్‌ నేత ఆరూరి రమేష్‌,, తాజాగా, అమిత్‌ షా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అటు బీజేపీ ఎంపీ సోయం బాపూరావు అమిత్‌ షా మీటింగ్‌కు గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. ఎన్నికల నాటికి నేతల కప్పదాట్లు మరింత పెరగనుండటంతో.. పొలిటికల్‌ హీట్‌ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.