Telangana: కాంగ్రెస్‌లోకి వలసలు మొదలైనట్టేనా?.. KCR రీ ఎంట్రీతో కారులో జోష్‌ పెరుగుతుందా..

Big News Big Debate: పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నుంచి అధికార కాంగ్రెస్‌ వైపు వలసలు మొదలవడంతో పొలిటికల్‌ సెగ రాజుకుంది. మరోవైపు, ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు వచ్చిన బీఆర్‌ఎస్‌ బాస్‌ కేసీఆర్‌.. కాంగ్రెస్‌పై సమరభేరికి సిద్ధమని ప్రకటించడంతో.. రాష్ట్ర రాజకీయం రణక్షేత్రంలా మారడం ఖాయమనిపిస్తోంది.

Follow us

|

Updated on: Feb 06, 2024 | 7:19 PM

పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నుంచి అధికార కాంగ్రెస్‌ వైపు వలసలు మొదలవడంతో పొలిటికల్‌ సెగ రాజుకుంది. మరోవైపు, ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు వచ్చిన బీఆర్‌ఎస్‌ బాస్‌ కేసీఆర్‌.. కాంగ్రెస్‌పై సమరభేరికి సిద్ధమని ప్రకటించడంతో.. రాష్ట్ర రాజకీయం రణక్షేత్రంలా మారడం ఖాయమనిపిస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌గా.. పొలిటికల్‌ వార్‌ అంతంతకూ ముదురుతోంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేసిన కాంగ్రెస్‌.. గులాబీ నేతలకు గాలం వేయడం ప్రారంభించింది. అందులో భాగంగానే, పెద్దపల్లి బీఆర్‌ఎస్‌ ఎంపీ వెంకటేశ్‌ నేత.. సీఎం రేవంత్‌, ఏఐసీసీ నేత కేసీవేణుగోపాల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. సిట్టింగ్‌ ఎంపీ.. పార్టీమారడం బీఆర్‌ఎస్‌కు పెద్ద షాకనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోందిప్పుడు. వెంకటేశ్‌నేత తర్వాత ఇంకెవరనే చర్చ కూడా మొదలైంది.

ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ సైతం తగ్గేదేలె అంటోంది. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు వచ్చిన అధినేత కేసీఆర్‌కు.. పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా పార్టీనేతలతో సమావేశమైన ఆయన.. కేఆర్‌ఎంబీ అంశంలో కాంగ్రెస్‌ప్రభుత్వంపై యుద్ధం చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. ఈనెల 13న నల్గొండలో భారీ బహిరంగసభ నిర్వహించి.. ప్రజలకు అన్ని విషయాలు చెప్పాలని నిర్ణయించారు.

సీఎం రేవంత్‌ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్‌ బాస్‌ . సీఎం ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారనీ.. తనను, తన పార్టీని టచ్‌ చేయడం ఎవరివల్లా కాదని స్పష్టం చేశారు. హేమాహేమీలతో తలపడిన చరిత్ర తమకు ఉందనీ.. ఉడతబెదిరింపులకు భయపడబోమనీ తేల్చి చెప్పారు కేసీఆర్‌.

మొత్తానికి, పార్లమెంట్‌ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వార్‌ మరింత పీక్స్‌కు చేరేలా కనిపిస్తోంది. సమరానికి సై అంటూ గులాబీబాస్‌ సవాల్‌ విసురుతుంటే.. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో బీఆర్‌ఎస్‌ను దెబ్బతీయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. మరి, అసెంబ్లీ ఓటమితో నీరసపడిన బీఆర్‌ఎస్‌కు కేసీఆర్‌ రీ ఎంట్రీ బూస్టిస్తుందా? కాంగ్రెస్‌లోకి నేతల వలసల్ని నిలువరిస్తుందా? అన్నది చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పెడతారో తెలుసా..? కారణం ఇదేనట..!
పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పెడతారో తెలుసా..? కారణం ఇదేనట..!
తమిళనాట తాగు నీటి కష్టాలు.. సీఎం స్టాలిన్ ముందస్తు చర్యలు..
తమిళనాట తాగు నీటి కష్టాలు.. సీఎం స్టాలిన్ ముందస్తు చర్యలు..
ధ్యానంతో టెన్షన్ ఫ్రీ లైఫ్..పని ఒత్తిడిని దూరం చేసే పది చిట్కాలు
ధ్యానంతో టెన్షన్ ఫ్రీ లైఫ్..పని ఒత్తిడిని దూరం చేసే పది చిట్కాలు
రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లకూ రుణాలిస్తారా? తెలియాలంటే ఇది చదవాల్స
రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లకూ రుణాలిస్తారా? తెలియాలంటే ఇది చదవాల్స
డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడానికి కారు ఆపారు.. కట్ చేస్తే..
డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడానికి కారు ఆపారు.. కట్ చేస్తే..
ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్..!
ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్..!
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. స్టార్ హీరో సతీమణి..
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. స్టార్ హీరో సతీమణి..
రోడ్డుపై వెళ్తూ ఒక్కసారిగా ఆగిన కారు.. కదలకపోవడంతో వెళ్లి చూస్తే
రోడ్డుపై వెళ్తూ ఒక్కసారిగా ఆగిన కారు.. కదలకపోవడంతో వెళ్లి చూస్తే
సేంద్రియ వ్యవసాయంతో అదిరే రాబడి.. ఏకంగా సంవత్సరానికి రూ.40 లక్షలు
సేంద్రియ వ్యవసాయంతో అదిరే రాబడి.. ఏకంగా సంవత్సరానికి రూ.40 లక్షలు
వేగంగావెళ్తున్నవాహనం టైర్‌ ఊడిపోయి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది
వేగంగావెళ్తున్నవాహనం టైర్‌ ఊడిపోయి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది