Telangana: పోలీస్ స్టేషన్‌లోనే పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు.. ఎందుకో తెలిస్తే..

వివాహేతర సంబంధం కారణంగా రెండు వర్గాల మధ్య చిన్నగా మొదలైన గొడవ చివరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.. అక్కడికెళ్లినా ఇరు వర్గాలు ఏమాత్రం తగ్గలేదు.. ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకుంటూ నానా రచ్చ చేశారు. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Telangana: పోలీస్ స్టేషన్‌లోనే పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు.. ఎందుకో తెలిస్తే..
Kothagudem News

Edited By:

Updated on: Sep 25, 2026 | 9:08 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధం వ్యవహారం ముదరడంతో కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వర్గాలు తీవ్ర ఘర్షణకు దిగాయి. మొదట మాటల యుద్ధంతో ప్రారంభమైన ఈ వివాదం.. కాస్తా పరస్పర దాడులకు దారితీసింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోకి దూసుకెళ్లారు. అక్కడితో ఆగకుండా స్టేషన్ లోపలే విచక్షణారహితంగా కొట్టుకున్నారు.

ఈ ఘర్షణలో మహిళలు సైతం ఒకరి జుట్లు ఒకరు పట్టుకుని తీవ్రంగా కొట్లాటకు దిగారు. ఆ సమయంలో త్రీ టౌన్ పోలీసులు వినాయక నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉండటంతో స్టేషన్‌లో సిబ్బంది తక్కువగా ఉన్నారు. ఇదే అదునుగా భావించిన పదుల సంఖ్యలోని వ్యక్తులు స్టేషన్ లోపలే రెచ్చిపోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.

పరిస్థితి చేయి దాటుతుండటంతో అప్రమత్తమైన నైట్ డ్యూటీ కానిస్టేబుళ్లు.. ఒక దశలో స్టేషన్ తలుపులు బలవంతంగా మూసివేసి, వారిని బయటకు పంపాల్సి వచ్చింది. అనంతరం ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు, ఘర్షణకు పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్‌లోనే ఇలా కొట్లాటకు దిగడంతో ఇది పోలీస్ స్టేషనా.. లేక రహదారా? అని స్థానికులు అవాక్కయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us