అయ్యప్ప మాల వేసుకుంటుండగా భక్తుడు ఒక్కసారిగా కుప్పకూలి మృతి..!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష చేపట్టేందుకు మాల ధరించడానికి ఆలయానికి వచ్చిన లింబాద్రి అనే భక్తుడు.. మాల ధారణ సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చలికి ఫిట్స్ రావడంతో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు..

అయ్యప్ప మాల వేసుకుంటుండగా భక్తుడు ఒక్కసారిగా కుప్పకూలి మృతి..!
Ayyappa Devotee Death In Rajanna Sircilla

Edited By:

Updated on: Nov 20, 2026 | 10:37 AM

వీర్నపల్లి, నవంబర్ 20: అయ్యప్ప స్వామి మాల ధరించి.. నలభై ఒక్క రోజుల పాటు దీక్ష చేపట్టేందుకు సిద్ధమైన ఓ భక్తుడికి విధి తీరని అన్యాయం చేసింది. అయ్యప్ప స్వామి మాల ధరించేందుకు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆలయానికి వచ్చిన భక్తుడు.. మాల ధారణ సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లికి చెందిన లింబాద్రి.. సిరిసిల్ల పట్టణంలోని అయ్యప్ప దేవాలయానికి మాల ధరించేందుకు వచ్చాడు. అయితే మాల ధారణ జరుగుతున్న సమయంలోనే ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన అయ్యప్ప భక్తులు లింబాద్రిని సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

చలికి ఫిట్స్ రావడంతోనే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా వైద్యులు తెలిపినట్లు సమాచారం. అయ్యప్ప మాల ధరించి స్వామి సేవలో తరించాలని ఆశపడిన భక్తుడు.. మాల ధారణ సమయంలోనే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us