Weather Report: రైతన్నలకు బిగ్‌ రిలీఫ్.. రాబోయే రెండ్రోజులు తెలుగురాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. ఓ వైపు ఏపీ, తెలంగాణ నుంచి నైరుతి నిష్క్రమణ, మరోవైపు ఈశాన్య రుతువపనాల రాకకు అనుకూల పరిస్థితుల ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే కొన్ని జిల్లాలో పొడి వాతావరణం ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది.

Weather Report: రైతన్నలకు బిగ్‌ రిలీఫ్.. రాబోయే రెండ్రోజులు తెలుగురాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
Telangana, Andhra Pradesh Rain Alert

Updated on: Oct 14, 2026 | 7:12 AM

శీతాకాలం వచ్చినా తెలుగురాష్ట్రాల్లో మాత్రం ఎండకాలం తరహా ఉష్ణో్గ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ఠంగా మహబూబ్‌నగర్‌ 38 డిగరీల భారీ ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఖమ్మం జిల్లాలో 35.6, మెదక్ – 35.2°C, భద్రాచలం – 35.0°C, నిజామాబాద్ – 34.7°C, , ఆదిలాబాద్ – 34.3°C , నల్గొండ – 33.5°C , హన్మకొండ – 33.5°C , రామగుండం – 33.6°C , హైదరాబాద్ – 33.8 డిగ్రీలు ఉష్నోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు. ఈ క్రమంలో ప్రజలకు ఈ వేడి వాతవరణం నుంచి ఊరట కల్పిస్తూ హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది.

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకారం.. రెండ్రోజుల్లో దేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల మరింత ఉపసంహరించనున్నాయని.. అదే సమయంలో దక్షిణ ద్వీపకల్పంలో ఈశాన్య రుతుపవనాల వర్షాలు ప్రారంభం కావడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని.. దీని ప్రభావంతో తెలంగాణలోని ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని ఆసిఫాబాద్‌, మంచిర్యాల, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ కూడా జారీ చేసింది.

ఏపీలో వాతావరణం ఇలా

నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం నుండి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి ఆవరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీనితో పాటుగా విస్తరిస్తున్న ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రానున్న మూడు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు.

రాబోయే రెండ్రోజుల వాతావరణం

బుధవారం: నేడు పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ; మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

గురువారం: అంబేద్కర్ కోనసీమ, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ; శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ; మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

శుక్రవారం: అల్లూరి, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ; పార్వతీపురంమన్యం, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ; మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us