Weather Report: ఈశాన్య రుతుపవనాల ఆగమనం!.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

తెలుగురాష్ట్రాలకు వాతవారణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. రైతుతి రుపవనాల నిష్క్రమణ, ఈశాన్య రుతుపవనాల రాకకు అనుకూల పరిస్థితుల ఉన్న నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని అంచానా వేసింది. రెండు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో పొడి వాతావరణంతో పాటు మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.

Weather Report: ఈశాన్య రుతుపవనాల ఆగమనం!.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
Telugu States Latest Weather Report

Updated on: Oct 12, 2026 | 6:57 AM

తెలంగాణ వాసులకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం కీలక సూచనలు చేసింది. రుతుపవనాల నిష్క్రమణతో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉదయం వేళ చాలా ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని, మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు పెరిగి.. ఎండ వేడి ఉక్కపోత ఉంచే ఛాన్స్ ఉందని తెలిసింది. అలాగే సాయంత్రం వేలల్లో మేఘాకృతమైన మేఘాలు కమ్ముకుంటాయని.. తద్వరా చల్లటి వాతావరణం ఏర్పడే ఛాన్స్ ఉందని తెలిపింది.

తెలంగాణలో వాతావరణం ఇలా

ఇక తెలంగాణ నుంచి నైరుతి రుపువనాలు పూర్తిగా నిష్ర్కమించడంతో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో ఉదయం పూట చల్లటి గాలులు, పగటి పూట భారీ ఉష్ణోగ్రతలతో జనాలు ఉక్కపోతకు గురువుతున్నారు. అయితే ఈశాన్య రుపువనాల రాకకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోపి వాతావరణంలో రాబోయే రోజుల్లో మార్పులు చోటుచేసుకోవచ్చని.. తద్వార కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.

ఏపీలో వాతావరణం ఇలా

అయితే తెలంగాణతో పోల్చుకుంటే ఏపీ వాతావరణం కాస్త బిన్నంగా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ఎఫెక్ట్‌తో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. అలాగే వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us