
తూర్పు విదర్భ, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య ఛత్తీస్‌గఢ్‌పై ఏర్పడిన వాయుగుండం వాయువ్య దిశగా పయనిస్తోంది. గత 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలిన ఈ తీవ్ర వాయుగుండం, జూలై 31, 2026 నాటికి పశ్చిమ విదర్భ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్యప్రదేశ్‌పై కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ వాయుగుండం విదర్భ, దక్షిణ మధ్యప్రదేశ్, మధ్య మహారాష్ట్ర మీదుగా వాయువ్య దిశగా తన పయనాన్ని కొనసాగించనుందని.. రాబోయే 24 గంటల్లో ఇది క్రమంగా బలహీనపడి, స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయిని.. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాట తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. వాతావరణ శాఖ ప్రకారం.. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే వర్షాల సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలు కూడా వీస్తాయని తెలిపింది. అటు రాయలసీమలో సైతం ఇలాంటి వాతావరణమే ఉంటుందని స్పష్టం చేశారు. అధికారులు.
సముద్ర మట్టంలో రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, ఉదయపూర్, ఇండోర్, పశ్చిమ విదర్భ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్యప్రదేశ్ ప్రాంతాలపై ఉన్న వాయుగుండం కేంద్రం, గోపాల్‌పూర్ గుండా ప్రయాణించి, అక్కడి నుంచి ఆగ్నేయంగా సముద్ర మట్టం వద్ద మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని దీని ప్రభావంతో అటు తెలంగాణలోనూ రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర స్పష్టం చేసింది.
వాతావరణ శాక సూచనలు ప్రకారం రాబోయే మూడు రోజుల వాతావరణం ఇదే
1వ రోజు: రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.
2వ రోజు: రాష్ట్రంలో ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.
3వ రోజు: రాష్ట్రంలో ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మూడు రోజులు వర్షాల సమయంలో రాష్ట్రంలో గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.