ఎవరూ చేయని త్యాగం.. కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న ‘ఆదర్శ’ తల్లి.. కారణం ఏమిటో తెలుసా?

Adilabad: బాలికల కోసం ఎనిమిది మరుగుదొడ్లు నిర్మించేందుకు పుస్తెల తాడును తాకట్టు పెట్టిన ఆదిలాబాద్ జిల్లా నవనీతకు, రెండేళ్లైనా రూ.8.40 లక్షల బిల్లులు రాలేదు. చివరకు కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకుని న్యాయం చేయాలని వేడుకుంది. అధికారులు హామీ ఇస్తున్నారు తప్ప.. రెండేళ్లు దాటినా బిల్లులు రావడం లేదని ఆ మహిళ వాపోయారు.

ఎవరూ చేయని త్యాగం.. కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న ‘ఆదర్శ’ తల్లి.. కారణం ఏమిటో తెలుసా?
A Mother Sold Her Mangalsutra for Education Dreams

Edited By:

Updated on: May 13, 2026 | 9:27 AM

ఓ తల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట బోరుమంది. కన్న బిడ్డతో కలెక్టరేట్‌కు వచ్చిన వివాహిత తన గోడు వెళ్లబోసుకుంది. మీరే న్యాయం చేయాలి సార్ అంటూ గొడగొడ ఏడ్చింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో చోటు చేసుకుంది. ప్రజావాణిలో భాగంగా సమస్య చెప్పుకునేందుకు వచ్చిన ఓ మహిళ ఆవేదన అక్కడున్న వారందిరిని కదిలించింది. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల నివాసి నవనీత. ఆ మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. రెండేళ్ల క్రితం బాలికల బాధను చూడలేక ఎనిమిది మరుగుదొడ్లను కట్టించారు. డబ్బులు వెంటనే వస్తాయంటూ అధికారులు సూచించడంతో చేతిలో డబ్బులు లేక పోయిన మెడలోని పుస్తెల తాడును తాకట్టు పెట్టి మరీ మూడు నెలల్లో పనులు పూర్తి చేయించారు. కానీ, ఆ తల్లి త్యాగం బూడిదలో పోసిన పన్నీరైంది. సకాలంలో వస్తాయనుకున్న బిల్లులు రెండేళ్లయినా రాలేదు. బిల్లుల రూపేణా రావాల్సిన రూ. 8.40 లక్షల కోసం మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి కార్యాలయాల వరకు చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది.

చివరి ప్రయత్నంగా సోమవారం ఆదిలాబాద్ ప్రజావాణిలో కలెక్టర్ రాజర్షిషా ఎదుట తన గోడును వెళ్లబోసుకుంది. బోరున విలపిస్తూ తనకు న్యాయం చేయాలని వేడుకుంది. బిల్లుల కు సంబంధించిన విషయాన్ని ఆరా తీసిన కలెక్టర్ చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. ప్రభుత్వానికి మీ సమస్యను తీసుకెళుతానంటూ హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉందని త్వరలోనే న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. అందరు అదికారులు రెండేళ్లుగా ఇదే మాట మాట చెపుతున్నారని న్యాయం చేసే దిక్కేలేదని మరోసారి నిరాశతో కొడుకును వెంటేసుకుని తిరుగుముఖం పట్టింది ఆ తల్లి.

కన్నీళ్లు పెట్టుకున్న తల్లి వీడియో..

 

Follow Us