
గల్లీల్లో గ్రామసింహాలు రక్కేస్తున్నాయి. పిల్లలు కనిపిస్తే పీక్కు తింటున్నాయి. దేశవ్యాప్తంగా కుక్కల సంరక్షణ గురించి పెద్దఎత్తున చర్చలు సాగుతున్నవేళ, పిల్లలు మాత్రం సేఫ్‌గా లేని పరిస్థితి. అటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కుక్కల బెడదతో స్థానికులు హడలిపోతున్నారు. ఒకటి రెండు కాదు వీధిలో కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయని వాపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉందంటున్నారు.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులెవరూ తమ గోడును పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా మేడ్చల్ మునిసిపల్ సర్కిల్‌లో దారుణం చోటు చేసుకుంది. గుండ్ల పోచంపల్లి డివిజన్ పరిధిలోని కండ్లకోయలో వీధి కుక్క దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ బాలుకను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన భయానక దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
కండ్లకోయ పరిధిలోని గాంధీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న వేణు, సుప్రజ దంపతుల 19నెలల కూతురు దాక్షిణి ఇంటి ముందు అడుకుంటుండగా వీధి కుక్క చిన్నారిపై దాడి చేసింది. దాడిలో దాక్షిత తలపై తీవ్ర గాయాలయ్యాయి. దాక్షిత తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెను ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ప్రస్తుతం దాక్షిత పరిస్థితి స్థిమితంగా ఉందని ఆమె తల్లిదండ్రులు పేర్నొన్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..