రోడ్డుపై వెళ్తున్న డీసీఎం వ్యాను అదుపుతప్పింది. అటుగా వెళ్తున్న ఓ బాలుడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్ ఆల్వాల్ ఇందిరాగాంధీ చౌరస్తా సమీపంలో గల రిలయన్స్ స్మార్ట్కు సర్కుల లోడుతో డీసీఎం వ్యాన్ వచ్చి ఆగింది. సరుకులు దింపడానికి దుకాణానికి ఎదురుగా వ్యాను నిలిపిన డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో అదుపు తప్పిన వాహనం రోడ్డుపైకి వచ్చి్ంది. అదే సమయంలో తల్లితో పాటు నడుచుకుంటూ వెళుతున్న కొడుకును ఢీ కొట్టింది. తల్లికి తీవ్ర గాయాలు కాక కొడుకు తిరుపాల్(9) అక్కడికక్కడే ప్రతి చెందాడు.
గాయలను సైతం లెక్కచేయకుండా తన కొడుకును దగ్గర తీసుకొని తల్లి హృదయ విదారకంగా రోధించారు. ఈ ఘటనను స్థానికంగా ఉన్నవారికి కంటతడి పట్టించేలాగా చేసింది. మృతి చెందిన బాలుడి తండ్రి భరత్ కూడా రెండు రోజుల క్రితం ఆక్సిడెంట్కి గురయ్యారు. దీంతో రైతుబజార్ సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు పిల్లలను తీసుకొని భర్తను చూడడానికి వచ్చి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు పోలీసులు. డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఒకవైపు తండ్రి హాస్పిటల్లో ఉండగా మరొకవైపు కుమారుడు చనిపోవడంతో వారి ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..