ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే డిసెంబరు 3 వరకు పొడిగించిన తెలంగాణ హైకోర్టు

కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. డిసెంబరు 3 వరకు స్టే పొడిగించింది.

  • Venkata Narayana
  • Publish Date - 6:03 pm, Wed, 25 November 20

కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. డిసెంబరు 3 వరకు స్టే పొడిగించింది. రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు వీలుగా స్టే ఎత్తివేయాలని ఈ కేసు విచారణ సందర్భంలో ఇవాళ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ కోర్టును కోరారు. అయితే, ధరణి ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై స్టే ఎత్తివేతకు హైకోర్టు నిరాకరించింది. అంతేకాదు, రేపు వాదనలు కొనసాగించాలని ఏజీ కోరినప్పటికీ హైకోర్టు నిరాకరించింది. ధరణిపై కేసుల విచారణ డిసెంబరు 3 కి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయాన్ని వెలిబుచ్చింది.