జీఎస్టీ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్‌లో హరీశ్ రావు డిమాండ్లు

వర్చువల్ గా ఇవాళ సాగిన జీఎస్టీ కౌన్సిల్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. జీఎస్టీ పరిహారం మొత్తం కేంద్రమే చెల్లించాలని ఆయన ఈ సందర్భంగా విన్నవించారు. ‘పరిహారం పొందడం రాష్ట్రాల చట్టబద్ధమైన హక్కు..’ అని తెలిపిన హరీశ్ రావు.. ఐజీఎస్టీ కింద‌ రాష్ట్రాలకు రావాల్సిన మొత్తం వెంటనే చెల్లించాలని కోరారు. ‘ఈ ఏడాది ఆరు నెలల సెస్ వసూలు‌ చేశారు.. కేంద్రం రాష్ట్రాలకు చెల్లించాల్సిన మూడు ఇన్‌స్టాల్ మెంట్స్ పెండింగ్‌లో […]

జీఎస్టీ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్‌లో హరీశ్ రావు డిమాండ్లు
Follow us

|

Updated on: Oct 05, 2020 | 2:56 PM

వర్చువల్ గా ఇవాళ సాగిన జీఎస్టీ కౌన్సిల్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. జీఎస్టీ పరిహారం మొత్తం కేంద్రమే చెల్లించాలని ఆయన ఈ సందర్భంగా విన్నవించారు. ‘పరిహారం పొందడం రాష్ట్రాల చట్టబద్ధమైన హక్కు..’ అని తెలిపిన హరీశ్ రావు.. ఐజీఎస్టీ కింద‌ రాష్ట్రాలకు రావాల్సిన మొత్తం వెంటనే చెల్లించాలని కోరారు. ‘ఈ ఏడాది ఆరు నెలల సెస్ వసూలు‌ చేశారు.. కేంద్రం రాష్ట్రాలకు చెల్లించాల్సిన మూడు ఇన్‌స్టాల్ మెంట్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మొత్తం రాష్ట్రాలకు వెంటనే పంచాలి’. అని హరీశ్ మీటింగ్ లో మాట్లాడారు. ‘కోవిడ్ పరిస్థితుల్లో ఈ మొత్తం రాష్ట్రాలకు అత్యంత అవసరం. కేంద్రమే జీఎస్టీ పరిహారం మొత్తం అప్పు తీసుకుని రాష్ట్రాలకు చెల్లించాలి’. అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.