యుగాంతం ముప్పు తప్పదా? భూమిని ఢీకొనబోతున్న గ్రహశకలంపై తాజా రిపోర్ట్‌!

భూమికి ముప్పు పొంచి ఉందని, ఓ గ్రహశకలం భూమిని ఢీకొట్టేందుకు దూసుకొస్తుందని ఇటీవలె నాసా శాస్త్రవేత్తలు ఓ బాంబు పేల్చారు. అయితే అది భూమిని ఢీ కొట్టే అవకాశం ఒక శాతం మాత్రమే ఉందని మొదట తెలిపారు. కొన్ని వారాల తర్వాత ఫిబ్రవరి 7న అది 2.3 శాతానికి పెరిగిందని రిపోర్ట్‌ ఇచ్చారు. ఇప్పుడు అది ఇంకాస్త పెరిగిందని ఓ నాసా శాస్త్రవేత్త ఆందోళనకరమైన విషయం వెల్లడించారు. దీంతో ఇక 2032లో యుగాంతం తప్పదా అనే భయం అయితే అందరినీ వెంటాడుతోంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

యుగాంతం ముప్పు తప్పదా? భూమిని ఢీకొనబోతున్న గ్రహశకలంపై తాజా రిపోర్ట్‌!
Yr4 Asteroid

Updated on: Feb 17, 2025 | 9:27 AM

దాదాపు 130 నుంచి 300 అడుగుల వెడల్పు ఉండే ఓ గ్రహశకలం భూమిని ఢీకొట్టే దిశగా వస్తుందని, 2032 డిసెంబర్‌లో అది భూమిని ఢీ కొన వచ్చని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. దానికి 2024 YR4 అని పేరు కూడా పెట్టారు. ఈ గ్రహశకలానికి సంబంధించిన మొదటి నివేదిక డిసెంబర్ 27, 2024న వెలువరించారు. ఆ సమయంలో నాసా ఖగోళ శాస్త్రవేత్తలు డిసెంబర్ 2032లో ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనే అవకాశం ఒక శాతం ఉందని లెక్కించారు. అయితే, ఫిబ్రవరి 7న ఒక బ్లాగ్ పోస్ట్‌లో, ఢీకొనే అవకాశం 2.3%కి పెరిగినట్లు పేర్కొన్నారు. అయితే తాజాగా ఆ 2.3 శాతం అనేది చాలా తక్కువ అనిపిస్తోందంటూ నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో నావిగేషన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న డేవిడ్ ఫర్నోచియా అభిప్రాయపడ్డారు. ఆయన ఈ చేసిన ఈ వ్యాఖ్యతో భూమి అంతానికి ముప్పు మరింత పెరిగిందనే విషయం స్పష్టమవుతోంది.

డేవిడ్‌ మాట్లాడుతూ.. 2.3 శాతం అంటే అసాధారణం. 2024 YR4 అనే ఆస్టరాయిడ్ ప్రస్తుతం టొరినో స్కేల్‌లో 10కి 3వ స్థానంలో ఉంది. భూమికి సమీపంలో ఉన్న వస్తువుల స్థానం 10కి 0పైనే ఉన్నాయి. భూమికి సమీపంలో ఉన్న వస్తువుల సంభావ్య ప్రమాదాన్ని నాసా ఈ టొరినో స్కేల్‌ ఆధారంగా లెక్కిస్తుంది. వాటికి ప్రమాద స్థాయిని బట్టి 10కి ఇన్ని పాయింట్ల అని ఇస్తుంది. ఇప్పటి వరకు భూమికి సమీపంలో ఉన్న వస్తువులు(గ్రహశకలాలు) అన్నింటికి 0 ఉన్నా.. ఈ 2024 YR4కు మాత్రం 3 పాయింట్లు ఇచ్చింది నాసా. అంటే కచ్చితంగా దీని వల్ల భూమికి ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: యుగాంతం ఎప్పుడో.. 321 ఏళ్ల కిందే చెప్పేసిన న్యూటన్‌! ఆ టైమ్‌ దగ్గరికి వచ్చేసింది!

అంతే కాకుండా ఈ 2024 YR4 గ్రహశకలం ప్రత్యేక కక్ష్య నమూనా కారణంగా 2028 ఏప్రిలో అది కనిపించకుండా పోతుంది. శక్తివంతమైన టెలిస్కోప్‌ వీక్షణ నుండి అదృశ్యమయ్యే అవుతుంది. అంతకంటే ముందే అంటే 2028 కంటే ముందే దానిపై వీలైనంత ఎక్కువ పరిశోధన జరిపి, దాని గురించి మరింత సమాచారం తెలుసుకోగలగాలి. ఇప్పటికే అందుకోసం శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేపట్టారు. గ్రహశకలం పరిమాణం గురించి అంచనాను వేయడానికి నాసాతో పాటు అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలు అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ అయిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను ఉపయోగిస్తాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ESA) ప్రకారం 2024 YR4 ఆస్టరాయిడ్ పరిమాణంలో ఉన్న ఒక వస్తువు కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి భూమిని ఢీకొంటుంది. అలాగే గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది.

2013లో రష్యాలోని చెల్యాబిన్స్క్ నగరం పైన ఇదే పరిమాణంలో ఉన్న ఒక ఉల్క భూమి వాతావరణంలోకి ప్రవేశించింది. ఆ ఉల్క చివరికి భూమికి 18 మైళ్ల ఎత్తులో గాలిలో పేలిపోయినప్పటికీ, ఆ పేలుడు 500 కిలోటన్నుల TNT(Trinitrotoluene)కి సమానమైన శక్తిని విడుదల చేసిందని ది ప్లానెటరీ సొసైటీ తెలిపింది. ఈ పేలుడు ఆరు నగరాల్లో 1,500 మందిని గాయపర్చింది. అలాగే 7200 భవనాలను దెబ్బతీసింది. అయితే నాసా బ్లాగ్ పోస్ట్ ప్రకారం, గతంలో భూమికి సమీపంలో ఉన్న అనేక వస్తువులు “రిస్క్ లిస్ట్”లో పెరిగాయి కానీ చివరికి సున్నాకి పడిపోయాయి కాబట్టి, పెద్దగా భయపడాల్సిన పనిలేదు అంటోంది.

మరిన్ని  సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి