టిక్‌టాక్‌కు షాకివ్వనున్న గూగుల్ షార్ట్స్..

టిక్‌టాక్‌.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సోషల్ మీడియా యాప్. చిన్న వీడియోలను చిత్రీకరించే ప్లాట్‌ఫామ్‌గా చెప్పుకోవచ్చు. ఈ యాప్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. దీంతో ఈ యాప్‌ మాదిరిగా.. మరో కొత్త యాప్ తీసుకొచ్చేందుకు గూగుల్‌ రెడీ అయ్యింది. ఈ క్రమంలో గూగుల్‌ కూడా.. షార్ట్ వీడియోస్ మేకింగ్‌ యాప్‌గా “షార్ట్స్‌”పేరుతో ఓ యాప్‌ను విడుదల చేయాలని గూగుల్ భావిస్తోంది. దీంతో టిక్‌టాక్‌ యూజర్లను తనవైపుకు తిప్పుకునేందుకు గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది. టిక్‌టాక్‌ను చైనాలో […]

టిక్‌టాక్‌కు షాకివ్వనున్న గూగుల్ షార్ట్స్..
Follow us

| Edited By:

Updated on: Apr 02, 2020 | 2:50 PM

టిక్‌టాక్‌.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సోషల్ మీడియా యాప్. చిన్న వీడియోలను చిత్రీకరించే ప్లాట్‌ఫామ్‌గా చెప్పుకోవచ్చు. ఈ యాప్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. దీంతో ఈ యాప్‌ మాదిరిగా.. మరో కొత్త యాప్ తీసుకొచ్చేందుకు గూగుల్‌ రెడీ అయ్యింది. ఈ క్రమంలో గూగుల్‌ కూడా.. షార్ట్ వీడియోస్ మేకింగ్‌ యాప్‌గా “షార్ట్స్‌”పేరుతో ఓ యాప్‌ను విడుదల చేయాలని గూగుల్ భావిస్తోంది.

దీంతో టిక్‌టాక్‌ యూజర్లను తనవైపుకు తిప్పుకునేందుకు గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది. టిక్‌టాక్‌ను చైనాలో 2016 లో స్టార్ట్ చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా 2018లో జరిగింది. ఈ యాప్‌లో మూడు సెకన్ల నుంచి ఒక నిమిషం వరకు వీడియోలను మేకింగ్ చేసి అప్‌లోడ్‌ చేయవచ్చు. స్వల్ప వ్యవధిలోనే ఈ యాప్ కోట్లమంది నెటిజన్లను ఆకర్షించింది.

Latest Articles