Youtube New Tool: క్రియేటర్ల కోసం యూట్యూబ్‌ అదిరిపోయే ఫీచర్‌.. ఈ కొత్త టూల్ ఉపయోగమేంటంటే..

|

Jul 31, 2022 | 3:46 PM

Youtube: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న వీడియో ప్లాట్‌ఫామ్స్‌లో యూట్యూబ్‌ది అగ్ర స్థానమనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీడియో రూపంలో ఏ సమాచారం కావాలన్నా వెంటనే అందరికీ గుర్తొచ్చేది యూట్యూబ్‌ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. యూజర్లకు...

Youtube New Tool: క్రియేటర్ల కోసం యూట్యూబ్‌ అదిరిపోయే ఫీచర్‌.. ఈ కొత్త టూల్ ఉపయోగమేంటంటే..
Follow us on

Youtube: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న వీడియో ప్లాట్‌ఫామ్స్‌లో యూట్యూబ్‌ది అగ్ర స్థానమనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీడియో రూపంలో ఏ సమాచారం కావాలన్నా వెంటనే అందరికీ గుర్తొచ్చేది యూట్యూబ్‌ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. యూజర్లకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూనే మరోవైపు క్రియేటర్లకు డబ్బులతో పాటు తమ ట్యాలెంట్‌ను ప్రదర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది యూట్యూబ్‌. ఈ క్రమంలోనే తాజాగా క్రియేటర్ల కోసం మరో అదిరిపోయే టూల్‌ను పరిచయం చేసింది యూట్యూబ్‌.

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ టూల్ సహాయంతో యూజర్లు ఎక్కు నిడివితో ఉన్న వీడియోలను 60 సెకండ్ల షార్ట్‌ వీడియోగా మార్చుకోవచ్చు. అంతేకాకుండా తగ్గించిన ఆ వీడియోకు టెక్ట్స్‌, ఫిల్టర్స్‌ వంటి వాటిని జోడించవచ్చు. ఈ టూల్‌తో క్రియేటర్లు తమ వీడియోలను మరింత ఆకర్షణీయంగా మార్చవచ్చు. దీంతో ఆడియన్స్‌ను పెంచుకోవచ్చని యూట్యూబ్‌ చెబుతోంది. ఎడిటింగ్‌ స్క్రీన్‌లో వీడియో సెగ్మెంట్‌ను ఎంచుకున్న తర్వాత షార్ట్స్‌ కోసం వీడియోలను యాడ్‌ చేసుకోవడం లేదా వీడియోను నేరుగా చిత్రీకరించుకునే అవకాశం ఉంది.

అంతేకాకుండా  షార్ట్స్ కెమెరాతో అద‌న‌పు వీడియోల‌ను షూట్ చేసుకోవచ్చు, ఆ గ్యాల‌రీ నుంచి 60 సెకండ్ల‌లోపు వీడియో పార్ట్‌ను ఎంచుకుంటే మ‌రిన్ని వీడియోల‌ను అప్‌లోడ్  చేసుకోవచ్చని యూట్యూబ్ తెలిపింది. ఈ టూల్స్‌ సహాయంతో మరికొంత మంది క్రియేటర్లను యూట్యూబ్‌కు ఆకర్షించవచ్చనే ఆలోచనతో ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..