Youtube: మీరు ఆ పని చేస్తున్నారా.? అయితే యూట్యూబ్‌ మిమ్మల్ని బ్లాక్‌ చేస్తుంది..

|

Nov 02, 2023 | 7:04 AM

ఇదిలా ఉంటే యూట్యూబ్‌లో ప్రకటనలు రావడం సర్వ సాధారణమైన విషయం. అయితే పదే పదే ప్రకటనలు చిరాకు పెడుతాయన్న కారణంతో కొందరు యాడ్‌ బ్లాకర్స్‌ను ఉపయోగిస్తుంటారు. క్రోమ్‌ సెట్టింగ్స్‌లో యాడ్‌ బ్లాకర్‌ ఉపయోగిస్తే యూజర్లకు ప్రకటనలు రావనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇలా యాడ్‌ బ్లాకర్ ఉపయోగించే వారికి యూట్యూబ్ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఒకవేళ యాడ్‌ బ్లాకర్‌ ఉపయోగిస్తే...

Youtube: మీరు ఆ పని చేస్తున్నారా.? అయితే యూట్యూబ్‌ మిమ్మల్ని బ్లాక్‌ చేస్తుంది..
Youtube
Follow us on

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్‌ను కోట్లాది మంది సభ్యులు ఉపయోగిస్తున్నారు. ప్రతీ రోజూ కోట్ల సంఖ్యలో కొత్త వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. యూట్యూబ్‌లో ద్వారా ఎంతో మంది ఆదాయాన్ని సైతం ఆర్జిస్తున్నారు.

ఇదిలా ఉంటే యూట్యూబ్‌లో ప్రకటనలు రావడం సర్వ సాధారణమైన విషయం. అయితే పదే పదే ప్రకటనలు చిరాకు పెడుతాయన్న కారణంతో కొందరు యాడ్‌ బ్లాకర్స్‌ను ఉపయోగిస్తుంటారు. క్రోమ్‌ సెట్టింగ్స్‌లో యాడ్‌ బ్లాకర్‌ ఉపయోగిస్తే యూజర్లకు ప్రకటనలు రావనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇలా యాడ్‌ బ్లాకర్ ఉపయోగించే వారికి యూట్యూబ్ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఒకవేళ యాడ్‌ బ్లాకర్‌ ఉపయోగిస్తే ఇకపై మీరు యూట్యూబ్‌లో వీడియోలు చూడలేరని తేల్చి చెప్పింది. యూట్యూబ్‌ మిమ్మల్ని బ్లాక్‌ చేస్తుంది. ఒకవేళ మీరు ప్రకటనలు లేకుండా యూట్యూబ్‌లో వీడియోలు చూడాలనుకుంటే మాత్రం కచ్చితంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని యూట్యూబ్‌ తెలిపింది.

యాడ్ బ్లాకర్‌ను ఉపయోగించడం వల్ల యూజర్లకు కేవలం మూడు ప్రకటనలు మాత్రమే డిస్‌ప్లే అవుతాయి. అయితే ఆదాయం పెంచుకోవడం లక్ష్యంగా పెట్టుకున్న యూట్యూబ్‌ యాడ్ బ్లాకర్లను డిసేబుల్‌ చేయకపోతే మూడు వీడియోలు మాత్రమే ప్లే అవుతాయి. ఆ తర్వాత వీడియోల్ని నిలిపివేయనున్నట్లు యూట్యూబ్ జూన్‌లోనే ప్రకటించింది. తాజాగా యాడ్‌ బ్లాకర్లపై దృష్టి సారించింది. ప్రపంచవ్యాప్తంగా యాడ్‌ బ్లాకర్లు ఉపయోగిస్తున్న వారిని బ్లాక్‌ చేసే పనిలో పడింది యూట్యూబ్‌, ఇందులో భాగంగానే ఇప్పటికే కొందరికి మెసేజ్‌లు పంపించి బ్లాక్‌ చేసింది.

ఇదే విషయమై యూట్యూబ్ కమ్యూనికేషన్స్ మేనేజర్‌ క్రిస్టోఫర్‌ లాటన్‌ మాట్లాడుతూ.. ‘యాడ్‌ బ్లాకర్స్‌ను ఉపయోగిస్తే యూట్యూబ్ నిబంధనలను ఉల్లంఘించినట్లే. యాడ్‌ బ్లాకర్లను వాడొద్దని యూజర్లకు ఇప్పటికే తెలిపాం. ఒకవేళ యాడ్స్‌ రాకుండా వీడియోలు చూడాలంటే ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే యూట్యూబ్‌ ఇప్పటికే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆటో రెన్యువల్‌తో కూడిన మంత్లీప్లాన్‌ రూ. 139 కాగా, ఆటో రెన్యువల్ లేకుండా రూ. 129, మూడు నెలల ప్లాన్‌ రూ. 399, ఏడాది ప్లాన్ రూ. 1290లను అందిస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..