ఇంటి నిఘాలో మరో లెవల్.. 4K వీడియో, 360 డిగ్రీల వ్యూతో కొత్త కెమెరా.. పూర్తి వివరాలు ఇవే

ఇంటి భద్రత కోసం సీసీ కెమెరాలు వాడటం ఇప్పుడు సాధారణమైపోయింది. అయితే రాత్రి సమయంలో చాలా కెమెరాల్లో నలుపు, తెలుపు దృశ్యాలే కనిపిస్తాయి. ఈ సమస్యకు భిన్నమైన పరిష్కారంతో Xiaomi Smart Camera 5 Pro వచ్చింది. పూర్తిగా చీకట్లోనూ రంగులతో కూడిన వీడియో చూపించడం ఈ కెమెరా ప్రత్యేకతగా నిలుస్తోంది. ప్రస్తుతం ఇది చైనాలో అందుబాటులోకి వచ్చింది.

ఇంటి నిఘాలో మరో లెవల్.. 4K వీడియో, 360 డిగ్రీల వ్యూతో కొత్త కెమెరా.. పూర్తి వివరాలు ఇవే
Xiaomi Smart Camera 5 Pro.jpg

Updated on: Sep 21, 2026 | 7:45 AM

ఇంట్లో పిల్లలు, వృద్ధులు, పెంపుడు జంతువులపై నిరంతరం నిఘా పెట్టాలంటే కెమెరాలో స్పష్టమైన దృశ్యాలతో పాటు తెలివైన గుర్తింపు వ్యవస్థ కూడా అవసరం. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త కెమెరాలో 4K వీడియో, స్థానిక AI, 360 డిగ్రీల కదలిక వంటి సదుపాయాలు ఇచ్చారు. చీకట్లోనూ రంగులు కనిపించడం దీని ప్రధాన ఆకర్షణ.

రెండు సెన్సర్లతో 4K వీడియో..

ఈ కెమెరాలో 8MP ప్రధాన సెన్సర్‌తో పాటు 4MP మరో సెన్సర్‌ను ఇచ్చారు. వీటి సాయంతో 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. రాత్రి సమయంలో రంగులతో కూడిన దృశ్యాలు కనిపించేందుకు అదనపు మృదువైన వెలుతురు ఏర్పాటు చేశారు. పూర్తిగా చీకటి ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి ఈ లైట్ పనిచేస్తుంది.

మనుషుల గుర్తింపు, సంఘటన ఆధారంగా రికార్డింగ్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. దీంతో ఇంటి చుట్టూ ఏదైనా కదలిక జరిగినప్పుడు దానిని గుర్తించడం సులభమవుతుంది.

కెమెరాలోనే AI.. 360 డిగ్రీల నిఘా

ఈ మోడల్‌లో 1.5 TOPS సామర్థ్యం ఉన్న AI చిప్‌ను అందించారు. ప్రత్యేకత ఏంటంటే డేటాను క్లౌడ్‌కు పంపకుండా కెమెరాలోనే మనుషులు, పెంపుడు జంతువులను గుర్తించగలదు. పిల్లల ఏడుపును గుర్తించి హెచ్చరిక ఇవ్వగల సదుపాయం కూడా ఉంది. డ్యూయల్ మోటార్ వ్యవస్థతో కెమెరాను 360 డిగ్రీలు తిప్పవచ్చు. పైకి, కిందికి కలిపి 174 డిగ్రీల వరకు కదిలించవచ్చు. రెండు వైపులా మాట్లాడుకునే సదుపాయం కూడా ఉంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే Dual-Band Wi-Fi 6, Mijia Smart Connect ఉన్నాయి. Wi-Fi 6తో డేటా బదిలీ వేగం 60 శాతం వరకు పెరుగుతుందని కంపెనీ చెబుతోంది. వీడియోలను microSD కార్డ్, Cloud, NASలో భద్రపరచవచ్చు. ప్రైవసీ కోసం Lens Masking, Local AI Processing, Access Controls వంటి సదుపాయాలు ఇచ్చారు. చైనాలో క్రౌడ్‌ఫండింగ్ ధర రూ.5,100 కాగా సాధారణ ధర రూ.7,200గా ఉంటుంది. భారత్‌లో విడుదల తేదీ, ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us