ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. దీనిని క్యాష్ చేసుకోవడానికి పలు ఈ కామర్స్ సైట్స్ భారీ డిస్కౌంట్స్ అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అమెజాన్ సైతం సేల్స్ పేరుతో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు ఇతర ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సైతం ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. దీవాళి విత్ ఎమ్‌ఐ పేరుతో డిస్కౌంట్స్ ఇస్తోంది. షావోమీ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అమెజాన్‌లో ఇప్పటికే ఆఫర్లు అందిస్తుండగా షావోమీ ప్రత్యేకంగా తన కస్టమర్లకు ఆఫర్లను ప్రకటించింది. దీవాళి విత్ ఎమ్‌ఐ పేరుతో నిర్వహిస్తున్న ఈ సేల్‌లో ఏయే ఫోన్‌లపై ఎంత డిస్కౌంట్స్ లభిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..
* సేల్‌లో భాగంగా షావోమీ తమ కంపెనీకి చెందిన ఫోన్‌లపై ఏకంగా 45 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే స్మార్ట్ హోం డివైజ్‌లపై 65 శాతం, స్మార్ట్ టీవీలపై 60 శాతం వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఎంఐ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసే వారికి ప్రత్యేకంగా అదనపు ఆఫర్స్ లభించనున్నాయి.
* ఈ సేల్‌లో భాగంగా రెడ్‌మీ 12 స్మార్ట్ ఫోన్‌పై మంచి ఆఫర్ అందిస్తోంది. గత జనవరిలో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 19,990గా ఉండగా అన్ని డిస్కౌంట్స్‌తో కలిపి రూ. 14,749కి సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌ను 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు.
* ఇక రెడ్‌మీ నోట్ 12 ప్రో 5జీ ఫోన్‌పై కూడా షావోమీ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ. 27,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 17,999కే సొంతం చేసుకోవచచు.
* కేవలం స్మార్ట్ ఫోన్స్‌పై మాత్రమే కాకుండా బడ్స్‌పై కూడా డిస్కౌంట్స్ అందిస్తున్నారు. షావోమీ దీవాళి విత్ ఎమ్‌ఐ సేల్‌లో భాగంగా రెడ్‌మీ బడ్స్ 4 యాక్టివ్ టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్‌పూ కూడా డిస్కైంట్ అందిస్తున్నారు. ఈ బడ్స్ అసలు ధర రూ. 2,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 899కే సొంతం చేసుకోవచ్చు.
* ఇక స్మార్ట్ టీవీలపై కూడా భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. రెడ్ మీ 43 ఇంచెస్ స్మార్ట్ ఫైర్ టీవీ అసలు ధర రూ. 42,999కాగా, అన్ని డిస్కౌంట్స్‌ను కలుపుకొని ఏకంగా రూ. 19,999కే సొంతం చేసుకోవచ్చు.
* షావోమీ నుంచి విడుదలైన రోబో వాక్యూమ్ మ్యాప్‌పై కూడా భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. రోబో వాక్యూమ్ మ్యాప్ 2 అసలు ధర రూ.39,999 కాగా, ప్రస్తుతం రూ.23,999లకే సొంతం చేసుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..