AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laptops: కొత్త ల్యాప్‌టాప్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 35 వేలలోపు బెస్ట్ ప్రొడక్ట్స్‌పై ఓ లుక్కేయండి..

ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు, గృహోపకరణాల వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. పలు రకాల క్రెడిట్‌, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి ఇన్‌స్టాంట్‌గా 10 శాతం డిస్కౌంట్‌ సైతం అందిస్తున్నారు. మరి ఈ సేల్‌లో రూ. 35వేలలోపు లభిస్తోన్న కొన్ని ల్యాప్‌టాప్‌ల వివరాలు మీకోసం..

Laptops: కొత్త ల్యాప్‌టాప్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 35 వేలలోపు బెస్ట్ ప్రొడక్ట్స్‌పై ఓ లుక్కేయండి..
Laptops Under 50k
Narender Vaitla
|

Updated on: Oct 14, 2023 | 8:58 PM

Share

ప్రముఖ ఈ కామర్స్‌ సైట్‌ అమెజాన్‌ ప్రస్తుతం అమెజాన్‌ గ్రేట్ ఇండియన్‌ సేల్ పేరుతో సేల్‌ నిర్వహిస్తున్న ఈ విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు, గృహోపకరణాల వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. పలు రకాల క్రెడిట్‌, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి ఇన్‌స్టాంట్‌గా 10 శాతం డిస్కౌంట్‌ సైతం అందిస్తున్నారు. మరి ఈ సేల్‌లో రూ. 35వేలలోపు లభిస్తోన్న కొన్ని ల్యాప్‌టాప్‌ల వివరాలు మీకోసం..

Acer Aspire 3: అసర్‌ కంపెనీకి చెందిన ఈ ల్యాప్‌టాప్‌ ఐటెల్ కోర్‌ ఐ3 1215యూ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 8 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌తో విడుదలైన ఈ ల్యాప్‌టాప్‌ అసలు ధర ర. 48,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 33,900కి సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా డిస్కౌంట్ లభించనుంది. ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్స్‌ను అందించారు.

Acer Aspire 3

Lenovo IdeaPad Slim 3: లెనోవో కంపెనీకి చెందిన ఈ ల్యాప్‌టాప్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ3-1115జీ4 11th జనరేషన్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 15.6 ఇంచెస్‌కు చెందిన ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. విండోస్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్‌ యూహెచ్‌ఈడ గ్రాఫిక్‌ కార్డును అందించారు. ఈ ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ. 49,190కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 30,990కి సొంతం చేసుకోవచ్చు.

Lenovo Ideapad Slim 3

ASUS Vivobook 14, Intel Core i3: అసుస్‌ కంపెనీకి చెందిన ఈ ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ. 50,990కాగా, 33 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 33,990కి సొంతం చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో 11 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. విండోస్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌లో 8జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్‌ కెపాసిటీని అందించారు.

Asus Vivobook 14

HP Laptop 15s: హెచ్‌పీ కంపెనీకి చెందిన ఈ ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ. 41,660కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 33,990కి సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 8 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ను అందించారు.

Hp Laptop 15s

Dell 14 Laptop: రూ. 35 వేలలోపు లభిస్తోన్న బెస్ట్‌ ల్యాప్‌టాప్స్‌లో డెల్‌ కంపెనీకి చెందిన డెల్‌ 14 ల్యాప్‌టాప్‌ ఒకటి. ఇంటెల్‌ 11th జనరేషన్‌ ఐ3 1115జీ4 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ల్యాప్‌టాప్‌లో 14 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఈ ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ. 49,215కాగా, 29 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 34,990కి సొంతం చేసుకోవచ్చు.

Dell 14 Laptop

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం.. జస్ట్ 50 రోజుల్లోనే చేతికి పంట!
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం.. జస్ట్ 50 రోజుల్లోనే చేతికి పంట!
మాంసం ప్రియులకు హెచ్చరిక..ఇక్కడ నాన్‌వెజ్‌కు నో ఎంట్రీ..మర్చిపోతే
మాంసం ప్రియులకు హెచ్చరిక..ఇక్కడ నాన్‌వెజ్‌కు నో ఎంట్రీ..మర్చిపోతే
రాజ పోషకాలు రాగులు.. డైలీ ఒక్క గ్లాస్ చాలు మామ..
రాజ పోషకాలు రాగులు.. డైలీ ఒక్క గ్లాస్ చాలు మామ..
సినిమా చూస్తూ ఏడ్చేసిన జనాలు.. 2016లో ఈ సినిమా సంచలనం..
సినిమా చూస్తూ ఏడ్చేసిన జనాలు.. 2016లో ఈ సినిమా సంచలనం..
అందం ఆడవారికి మాత్రమే కాదు.. అబ్బాయిలు ఈ టిప్స్ తో హీరోలా మారొచ్
అందం ఆడవారికి మాత్రమే కాదు.. అబ్బాయిలు ఈ టిప్స్ తో హీరోలా మారొచ్
శరీరానికి ఉక్కు లాంటి బలం.. ఈ లడ్డు లాభాలు తెలిస్తే షాకే..
శరీరానికి ఉక్కు లాంటి బలం.. ఈ లడ్డు లాభాలు తెలిస్తే షాకే..
నల్లటి నాగుపాములాంటి జడ కావాలంటే ఈ ఒక్కటి చాలు..
నల్లటి నాగుపాములాంటి జడ కావాలంటే ఈ ఒక్కటి చాలు..
భక్తులకు గుడ్‌న్యూస్.. శివరాత్రి సందర్భంగా ఈ ప్రాంతాలకు
భక్తులకు గుడ్‌న్యూస్.. శివరాత్రి సందర్భంగా ఈ ప్రాంతాలకు
నాకు అర్థమవుతుంది.. అన్నీ మీకే చెప్పేస్తా..అనిల్ రావిపూడి..
నాకు అర్థమవుతుంది.. అన్నీ మీకే చెప్పేస్తా..అనిల్ రావిపూడి..
గ్యాస్‌ ఎక్కువ రోజులు రావాలా..? సింపుల్‌ టిప్స్‌ పాటించండి!
గ్యాస్‌ ఎక్కువ రోజులు రావాలా..? సింపుల్‌ టిప్స్‌ పాటించండి!