
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్) స్తంభించింది. ఈ రోజు(ఆదివారం) ఇలా రెండోసారి జరిగింది. దీని వలన వేలాది మంది వినియోగదారులు ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. మార్చి 10, 2025 నాటికి, 40,000 కంటే ఎక్కువ మంది తాము ట్విట్టర్ వాడటంతో సమస్యను ఎదుర్కొంటున్నాం అంటూ రిపోర్ట్ చేశారు. అమెరికాతో పాటు ఇండియా, యూకే, ఆస్ట్రేలియా, కెనడాలోని వెబ్, మొబైల్ యాప్‌లలో ఈ సమస్య తలెత్తింది. సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరుగుతుందని, వీలైనంత త్వరగా మళ్లీ యాథావిధిగా సేవలు ప్రారంభం అవుతాయని సమాచారం. గతంలో కూడా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఇలానే పనిచేయకుండా నిలిచిపోయిన విషయం తెలిసిందే.