అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర విజయవంతం అయ్యింది. జోస్ సహా నలుగురు సభ్యుల బృందంతో కూడిన క్యాప్సుల్ సురక్షితంగా భూమికి చేరుకుంది. రోదసీని టచ్ చేసిన వీరు నేరుగా భూమికి చేరుకుంది. వ్యోమ నౌకలో జెఫ్ బెజోస్‌తో పాటు అతని సోదరుడు మార్క్ బెజోస్, 82 ఏళ్ల వాలీ ఫంక్, 18 ఏళ్ల ఫిజిక్స్ విద్యార్థి ఆలివర్ డెమెన్ కలిసి ప్రయాణించారు.
Congratulations to all of Team Blue past and present on reaching this historic moment in spaceflight history. This first astronaut crew wrote themselves into the history books of space, opening the door through which many after will pass. #GradatimFerociter #NSFirstHumanFlight
— Blue Origin (@blueorigin) July 20, 2021
పశ్చిమ టెక్సాస్ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్ సైట్ వన్ నుంచి బ్లూ ఆరిజిన్ షెపర్డ్ రోదసిలోకి దూసుకెళ్లింది. న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో నలుగురు సభ్యుల బృందం నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి వెళ్లింది. 11 నిముషాలు అంటే సరిగ్గా 6.41 గంటలకు వ్యోమగాములు సమీపం లోని ఎడారిలో ల్యాండయ్యారు. రోదసియానానికి 45 నిముషాల ముందు బెజోస్ బృందం క్యాప్సూల్ దగ్గరకు చేరుకుంది. సరిగ్గా భారత కాలమాన ప్రకారం సాయంత్రం 6 గంటలకు స్పేస్ షిప్ లోకి చేరుకున్నారు.
Scenes from #NSFirstHumanFlight astronaut load. pic.twitter.com/L7u1ZaYn60
— Blue Origin (@blueorigin) July 20, 2021
రోదసీలోకి వెళ్లి వచ్చిన అతి పిన్న వయసు వ్యక్తిగా ఆలివర్ డేమెన్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు 1961 లో సోవియట్ యూనియన్ ప్రయోగించిన వోస్టాక్ 2 మిషన్‌లో 25 ఏళ్ల వయసులో రష్యన్ వ్యోమగామి గెర్మాన్ టిటోవ్ అంతరిక్షానికి వెళ్లిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు ఉంది. అంతేకాకుండా 82 ఏళ్ల వాలీ ఫంక్ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన అతి పెద్ద వయస్కురాలిగా నిలిచి రికార్డు సృష్టించింది.
న్యూ ఫెపర్డ్ నౌక భూమి నుంచి అంతరిక్షంగా భావించే ఖర్మాన్ లైన్‌ను దాటి 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. న్యూ షెపర్డ్ నౌకకు ఉపయోగించిన రియూజబుల్ బూస్టర్ సురక్షితంగా లాంచింగ్ స్టేషన్‌లో చేరుకుంది. వ్యోమనౌక మ్యాడ్యుల్‌లో ప్రయాణిస్తున్న నలుగురి బృందం అంతరిక్ష యాత్రను ముగించుకొని సురక్షితంగా భూమిని చేరుకుంది.