Worlds First Electric Car: 200ఏళ్ల క్రితమే రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ కారు.. అప్పట్లో EV వాహనం స్పీడ్‌ ఎంతో తెలుసా..?

స్కాట్లాండ్‌లో నివసించే రాబర్ట్ ఆండర్సన్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫోర్‌ వీలర్‌ వాహనాన్ని తయారు చేశాడు. అతను తన డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చాడు. ఈ కారులో అతను సింగిల్ ఛార్జ్ బ్యాటరీని ఉపయోగించాడు. అంటే ఒక్కసారి మాత్రమే ఛార్జ్ చేయవచ్చు. ఆ తర్వాత ఈ ఎలక్ట్రిక్ కారు గంటకు

Worlds First Electric Car: 200ఏళ్ల క్రితమే రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ కారు.. అప్పట్లో EV వాహనం స్పీడ్‌ ఎంతో తెలుసా..?
World's First Electric Car

Updated on: May 27, 2023 | 5:37 PM

పెట్రోల్, డీజిల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు విడుదల చేసే పొగ వల్ల పెద్ద మొత్తంలో వాయు కాలుష్యం ఏర్పడుతుంది. అందుకే ఇలాంటి వాహనాలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విద్యుత్‌తో నడిచే వాహనాలు కాలుష్యాన్ని నివారిస్తాయి. ఇది కాకుండా, ఇంధన ధరల పెరుగుదల కారణంగా కూడా చాలా మంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఈవీ వాహనాలకు వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రారంభించాయి. అయితే, ఎలక్ట్రిక్ కార్లు కొత్త ఆధునిక భావన అని చాలా మంది అనుకుంటారు. కానీ ఎలక్ట్రిక్ కారు ఆలోచన చాలా కాలం క్రితమే అందుబాటులో ఉందని మీకు తెలుసా..? మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కారు దాదాపు 200 సంవత్సరాల క్రితమే తయారు చేశారని తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్‌ తింటారు.

ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు..

19వ శతాబ్దం ప్రారంభం నుండి ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన కొత్త పరికరాలు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందాయి. ప్రజలు ఎక్కువగా నాలుగు చక్రాల వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ కాలంలో డీజిల్‌తో నడిచే కార్లు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి. కానీ, 1832లో స్కాటిష్ మెకానిక్ రాబర్ట్ ఆండర్సన్ ఎవరూ ఊహించని పని చేశాడు. స్కాట్లాండ్‌లో నివసించే రాబర్ట్ ఆండర్సన్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫోర్‌ వీలర్‌ వాహనాన్ని తయారు చేశాడు. అతను తన డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చాడు. ఈ కారులో అతను సింగిల్ ఛార్జ్ బ్యాటరీని ఉపయోగించాడు. అంటే ఒక్కసారి మాత్రమే ఛార్జ్ చేయవచ్చు. ఆ తర్వాత ఈ ఎలక్ట్రిక్ కారు గంటకు 4 కిలోమీటర్ల వేగంతో దాదాపు 2.5 కిలోమీటర్లు నడిచింది.

రాబర్ట్ ఆండర్సన్ నిర్మించిన EV కారు ఆవిష్కరణ అనంతరం 20 ఏళ్ల తరువాత ఎట్టకేలకు రీఛార్జిబుల్‌ బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ కారు కూడా సిద్ధమైంది.1865లో లెడ్ యాసిడ్ బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ కారు రోడ్డుపైకి వచ్చింది. ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త 1865లో లెడ్ యాసిడ్ బ్యాటరీతో తొలిసారిగా ఎలక్ట్రిక్ కారును నడిపాడు. అలా ఈ ఆటో రంగం అభివృద్ధి చెందుతూనే ఉంది. 1891 లో మొదటి ఎలక్ట్రిక్ కారు అమెరికాలో ఉత్పత్తి చేయబడింది. 8 సంవత్సరాల తరువాత థామస్ ఎడిసన్ దీర్ఘకాలం ఉండే నికెల్-ఆల్కలీన్ బ్యాటరీని అభివృద్ధి చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us