Wikipedia: ఇకపై ఏలా పడితే అలా మార్చేస్తామంటే కుదరదు.. కొత్త నిబంధన తీసుకొస్తున్న వీకిపీడియా..

Wikipedia Universal Code Of Conduct: వ్యక్తుల నుంచి మొదలు పెడితే సంస్థల వరకు... దేశాల నుంచి మొదలు ప్రదేశాల వరకు ఇలా ఏ సమాచారం కావాలన్నా ముందుగా వినిపించే సమాధానం...

Wikipedia: ఇకపై ఏలా పడితే అలా మార్చేస్తామంటే కుదరదు.. కొత్త నిబంధన తీసుకొస్తున్న వీకిపీడియా..

Updated on: Feb 04, 2021 | 6:01 AM

Wikipedia Universal Code Of Conduct: వ్యక్తుల నుంచి మొదలు పెడితే సంస్థల వరకు… దేశాల నుంచి మొదలు ప్రదేశాల వరకు ఇలా ఏ సమాచారం కావాలన్నా ముందుగా వినిపించే సమాధానం ‘వికీ’లో వెతుకు. మనిషి జీవితంలో అంతలా ఓ భాగమైపోయింది ఇంటర్నెట్‌ వేదికగా ఉండే వికీపిడియా.
ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా సమస్త సమాచారాన్ని అందించే వికీపిడియా సేవలు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 317 భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉంటే సాధారణంగా వికీపిడియాలో ఉండే సమాచారాన్ని ఎవరైనా మార్చవచ్చు. ఏదైనా అంశాన్ని నెటిజెన్లు తమకు తాముగా సమాచారాన్ని మార్చే అవకాశం కల్పించారు. అయితే దీనివల్ల తాజాగా కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొందరు ఆకతాయిలు వికీపిడియాలో ఉన్న సమాచారాన్ని మార్చి వ్యక్తిగత దూషణ, రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రచురిస్తున్నారు. దీంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న వికీపిడియా కొత్త నింబంధనను తీసుకురానుంది. ఇందులో భాగంగా ‘యూనివర్సల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌’ను అమలు చేయనున్నారు. దీనిద్వారా కొన్ని నిషేధిత పదాలతో కూడిన ఒక డేటా బేస్‌ను రూపొందిస్తారు. తమ పాలసీకి విరుద్ధంగా ఉన్న పదాలు వికీపిడియాలో ఎవరైనా చేరిస్తే వెంటనే గుర్తించేలా ఒక సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకున్నారు.

Also Read: హెచ్‌డిఎఫ్‌సి డిజిటల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ జారీ చేయకుండా ఆర్బీఐ తాత్కాలిక నిషేధం, అసలు ఏం జరుగుతోంది..?