బైక్‌లలో డీజిల్‌ ఎందుకు వాడరో తెలుసా?.. పెట్రోల్ మాత్రమే వాడకం వెనక అసలు రహస్యం ఇదే!

సాధారణంగా కార్లు, బస్సులు, లారీల వంటి భారీ వాహనాల మైలేజ్, పవర్ కోసం ఎక్కువగా డీజిల్ ఇంజన్‌లను ఉపయోగిస్తారు. కానీ మనం డేయిలీ లైఫ్‌లో ఎక్కువగా వాడే బైక్‌లలో మాత్రం పెట్రోల్‌ ఇంజన్‌ను వాడుతారు. అసలు బైక్‌లలో పెట్రోల్‌ ఇంజన్‌లే ఎందుకు వాడుతారు, డీజిల్ ఎందుకు వాడరనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందిదా? అలా వాడితే ఏం జరుగుతుంది. అలా ఎందుకు వాడతో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

బైక్‌లలో డీజిల్‌ ఎందుకు వాడరో తెలుసా?.. పెట్రోల్ మాత్రమే వాడకం వెనక అసలు రహస్యం ఇదే!
Why Motorcycles Use Petrol Engines

Updated on: May 16, 2026 | 11:46 AM

సాధారణంగా పెట్రోల్, డీజిల్ ఇంజన్‌లు ఒకేలా పనిచేయవు, ఇవి పనిచేసే విధానం వేర్వేరుగా ఉంటుంది. ఇందనాన్ని మండిచాంలంటే పెట్రోల్‌ ఇంజన్‌లో అయితే స్కార్క్‌ ప్లగ్‌ను ఉపయోగిస్తారు. కానీ డీజిల్‌ ఇంజన్‌లో మాత్రం ఇది పనిచేయదు. డీజిల్ ఇంజన్‌లో గాలిని అత్యధిక ఒత్తిడికి గురిచేసి, దాని ద్వారా ఉత్పన్నమయ్యే వేడితో ఇందనం మండేలా చేస్తారు. ఈ అధిక ఒత్తిడి తట్టుకునేందుకు డీజిన్ ఇంటన్‌లో బలమైన లోహాన్ని వాడుతారు. అందుకే దీనిలో ఇంజన్ పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి బైక్‌ లాంటి చిన్న వాహనాలు ఇంత పెద్ద పరిమాణంలో ఉన్న బరువైన ఇంజన్‌ను అమర్చడం కష్టమవుతుంది. అలాగే ఈ ఇంజన్ బరువును రైడర్ కంట్రోల్ చేయలేడు.

వెయిట్ అండ్ వైబ్రేషన్స్

అలాగే డీజిల్ ఇంజన్‌లో ఇంధనం అధిక ఒత్తిడితో మండటం వల్ల ఇంజన్ లోపల భారీ స్థాయిలో శక్తి విడుదలవుతుంది. దీని వల్ల భారీ శబ్ధంతో పాటు వైబ్రేషన్స్‌ కూడా వస్తాయి. వీటిని తట్టుకోవడానికి కార్లు లేదా లారీలలో పెద్ద చాసిస్, వైబ్రేషన్ అబ్సార్బర్‌లు ఉంటాయి. కానీ బైక్‌లలో చాలా తక్కువ స్థలం ఉండటం వల్ల ఆ కంపనాలు నేరుగా రైడర్‌కు తగిలే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలో రైడర్ బైక్‌ను నడపడం కష్టంగా మారుతుంది.

ఎక్కువ ఖర్చు – తక్కువ పికప్

ఇవే కాదు బైక్‌లలో డీజిల్ ఇంజన్‌ల పెట్టకపోవడానికి ఆర్థిక కారణాలు కూడా ఒకటి. ఎందుకంటే డీజిల్ ఇంజన్‌లో ఖరీదైన ఫ్యూయల్ ఇంజెక్టర్లు, ఎయిర్‌ పంప్ చేయడానికి టర్బోచార్జర్‌ల వంటి అధునాతన సాంకేతికత కావాల్సి ఉంటుంది. ఒక వేళ ఇవి అమరిస్తే బైక్ తయారీ ఖర్చు భారీ పెరుగుతుంది. అలాగే డీజిల్ ఇంజన్‌లలో ఆర్‌పీఎం తక్కువగా పనిచేంది. అంటే ఎక్కువ బరువును మోస్తాయే తప్పా తక్షణ వేగాన్ని అందించలేవు. కాబట్టి బైక్‌ నడిపేవారికి ఇది సౌకర్యంగా ఉండదు. ఇన్‌స్టెంట్‌ పికప్, వేగం కావాలంటే కేవలం పెట్రోల్ ఇంజన్‌ల వల్లే సాధ్యమవుతుంది.

బైక్‌లో డీజిల్ ఇంజన్ ప్రయోగం

అయితే బైక్‌లలో కూడా డీజిల్ ఇంజన్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రముఖ బైక్‌ తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌పీల్డ్‌ ఈ ప్రయోగాన్ని చేసింది. గతంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ టారస్ పేరుతో ఈ సంస్థ ఓ డీజిల్ ఇంజన్‌ బైక్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. కానీ దాని అధిక వైబ్రేషన్స్‌, మోయలేని బరువు కారణంగా ప్రజలు దానిని తిరస్కరించారు. దీంతో కంపెనీ ఈ మోడల్ బైక్‌ల నిలిపిచేసింది.

కస్టమర్ సేఫ్టీ

మొత్తంగా చూసుకుంటే కస్టమర్ల భద్రత, సౌకర్యం కోసం మాత్రమే బైక్‌లలో పెట్రోల్ ఇంజన్‌లను వాడుతుతున్నారు. బరువైన ఇంజన్, విపరీతమైన వైబ్రేషన్స్, ఖరీదైన మెయింటెనెన్స్ ఉండే డీజిల్ బైక్‌ల కంటే.. తేలికగా ఉంటూ, తక్షణ పికప్ ఇచ్చే పెట్రోల్ ఇంజన్‌లే బైక్‌కు ఎప్పుడూ సౌకర్యవంతంగా ఉంటాయి. టెక్నాలజీ ఎంత ముదిరినా, టూ-వీలర్ ప్రపంచంలో పెట్రోలే ఎప్పటికీ రారాజు అనడానికి ఇవే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ చేయండి.

Follow Us