ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లలో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్‌ది మొదటి స్థానమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మారుతోన్న కాలానికి అనుగుణంగా నిత్యం ఏదొ ఒక కొత్త ఫీచర్‌ను అందిస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తుంది కాబట్టే వాట్సాప్‌కు ఇంత క్రేజ్ ఉంది. ఇక కొత్త ఫీచర్లను అందిస్తోన్న తరుణంలో పాత ఫోన్‌లలో వాట్సాప్ తన సేవలను నిలిపివేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రతీ ఏటా కొన్ని ఫోన్‌లలకు వాట్సాప్ తన సేవలను ఆపేస్తుంది.
ఈ క్రమంలోనే తాజాగా 2023లో కూడా వాట్సాప్ కొన్ని ఫోన్‌లకు తమ సేవలను ఆపేస్తుంది. డిసెంబర్ 31 నుంచి 49 ఫోన్‌లలో వాట్సాప్ పని చేయదు. వీటిలో యాపిల్ సంస్థకు చెందిన ఫోన్‌లు కూడా ఉండడం విశేషం. వాట్సాప్ అందిస్తోన్న ఫీచర్లకు సదరు ఫోన్‌లు సపోర్ట్ చేయకపోవడమే దీనికి కారణంగా వాట్సాప్ చెబుతోంది. ఇంతకీ వచ్చే ఏడాది నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్న ఫోన్‌ల జాబితాపై ఓ లుక్కేయండి..
యాపిల్ ఐఫోన్ 5, ఆర్కో 53 ప్లాటినం, యాపిల్ ఐఫోన్ 5సీ, గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్ జెడ్‌టీఈ, గ్రాండ్ ఎక్స్ క్వాడ్ వీ987 జెడ్‌టీఈ, హెచ్‌టీసీ డిజైర్ 500, హువాయ్ అసెండ్ డీ, హువాయ్ అసెండ్ డీ1, హువాయ్ అసెండ్ డీ2, హువాయ్ అసెండ్ జీ740, హువాయ్ అసెండ్ మేట్, హువాయ్ అసెండ్ పీ1, క్వాడ్ ఎక్స్‌ఎల్, లెనెవో ఏ820, ఎల్‌జీ ఎనాక్ట్, ఎల్‌జీ లుసిడ్ 2, ఎల్‌జీ ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్‌డీ, ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్3, ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్3, ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్3 క్యూ, ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్5, ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్6, ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్7, ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్2 II, ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్3 II, ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్ 3 డ్యూయల్, ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్4 II, ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్ 4 II డ్యూయల్, ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్5, ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్5 డ్యూయల్, ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్5 II, ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్7, ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్7 II, ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్5 II డ్యూయల్, ఎల్‌జీ ఆప్టిమస్ నైట్రో హెచ్‌డీ, మెమో జెడ్‌టీఈ వీ956, సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏస్ 2, సామ్‌సంగ్ గ్యాలక్సీ కోర్, సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్2, సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్3 మిని, సామ్‌సంగ్ గ్యాలక్సీ ట్రెండ్ II, సామ్‌సంగ్ గ్యాలక్సీ ట్రెండ్ లైట్, సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎక్స్‌కవర్ 2, సామ్‌సంగ్ గ్యాలక్సీ, సోనీ ఎక్సీపీరియా ఆర్క్ ఎస్, సోనీ ఎక్సీపీరియా మైరో, సోనీ ఎక్సీపీరియా నియో ఎల్, వికో కిక్ ఫైవ్, వికో డార్క్‌నైట్ జెడ్‌టీ.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..