Whatsapp: మరో అద్భుత ఫీచర్‌తో వస్తోన్న వాట్సాప్‌.. ఇకపై అప్‌డేట్స్‌ సమాచారం ముందుగా యూజర్లకే..

|

Aug 01, 2022 | 7:01 PM

Whatsapp: వాట్సాప్‌.. ఈ మెసేజింగ్ యాప్‌కు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో...

Whatsapp: మరో అద్భుత ఫీచర్‌తో వస్తోన్న వాట్సాప్‌.. ఇకపై అప్‌డేట్స్‌ సమాచారం ముందుగా యూజర్లకే..
Follow us on

Whatsapp: వాట్సాప్‌.. ఈ మెసేజింగ్ యాప్‌కు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో ముందువరుసలో ఉంటుందీ యాప్‌. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షించడం, యాప్‌ యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండడంతో ఎక్కువ మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తుంటారు. ఇటీవల వరుసబెట్టి కొత్త అప్‌డేట్స్‌ను తీసుకొస్తున్న వాట్సాప్‌ తాజాగా చాట్‌ బాట్‌ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇంతకీ ఈ ఫీచర్‌ ఉపయోగమేంటనేగా..

సాధారణంగా వాట్సాప్‌లో ఎలాంటి అప్‌డేట్‌ లేదా కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వచ్చినా యూజర్లకు ఆ విషయం సోషల్‌ మీడియా ద్వారా లేదా వెబ్‌సైట్స్‌ ద్వారా తెలుస్తుంది. అలాకాకుండా వాట్సాప్‌ తీసుకొచ్చిన కొత్త ఫీచర్లు, భవిష్యత్తులో తీసుకురానున్న ఫీచర్లకు సంబంధించిన వివరాలను నేరుగా యూజర్లకే చేరవేస్తే ఎలా ఉంటుంది.? ఈ ఆలోచనతోనే వాట్సాప్‌ ఈ చాట్‌బాట్‌ను తీసుకొస్తోంది. వాట్సాప్‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్‌ ఉన్నా ఈ చాట్‌బాట్‌ ద్వారా యూజర్‌కు మెసేజ్‌ రూపంలో అలర్ట్‌ వస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉంది.

విజయవంతంగా పూర్తికాగానే ఆండ్రాయిడ్‌ యూజర్లకు తర్వాత ఐఓస్‌ యూజర్లకు పరిచయం చేయనున్నారు. వాట్సాప్‌ చాట్‌బాట్ కామన్‌గా అందరు యూజర్ల చాట్‌ బాక్స్‌లో కనిపిస్తుంది. అయితే ఎవరైనా ఈ సేవలు వద్దనుకుంటే సదరు వాట్సాప్‌ ఖాతాను బ్లాక్‌ చేస్తే సరిపోతుంది. వెంటనే చాట్‌ పేజీ నుంచి ఆ కాంటాక్ట్‌ డిలీట్‌ అవుతుంది. దీంతో చాట్‌బాట్‌ పంపించే మెసేజ్‌లు రాకుండా అడ్డుకోవచ్చు. యూజర్లకు కొత్త అప్‌డేట్స్‌పై అవగాహన కల్పించేందుకే ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..