వాట్సాప్‌కు ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు ఉన్నారు. తన వినియోగదారుల అవసరాలు, ఇబ్బందులు గుర్తించి పరిష్కరించడంలో వాట్సాప్ యాజమాన్యం ఎప్పుడూ ముందుంటుంది. అందులో భాగంగానే అనేక రకాల ఫీచర్లు, కొత్త అప్ డేట్లు తీసుకుస్తుంటుంది. ఈ క్రమంలో వాట్సాప్ మరో కొత్త అప్ డేట్ ను తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు కాంటాక్ట్ పేరును మీ ఫోన్లో సేవ్ చేయకుండానే వాట్సాప్ గ్రూప్ లలో యాడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు వాట్సాప్ లో ఏదైనా గ్రూప్ క్రియేట్ చేయాలనుకోండి. ప్రస్తుతం ఉన్న విధానాన్ని బట్టి వినియోగదారులు ఆ నంబర్ ను కాంటాక్ట్ లిస్ట్ సేవ్ చేస్తేనే గానీ గ్రూప్ లో యాడ్ చేయడం కుదరదు. అయితే ఈ కొత్త అప్ డేట్ ద్వారా డైరెక్ట్ గా నంబర్ నే గ్రూప్ లో యాడ్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వాట్సాప్ లోని ఈ అప్ డేట్ గురించి తన ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ హ్యాండిల్స్ ప్రకటించారు. కొన్ని వారాల్లో ఈ ఫీచర్ గ్లోబల్ వైడ్ గా ఉన్న వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఇకపై వాట్సాప్ గ్రూప్ లను క్రియేట్ చేయడం మరింత సులభతరం అవుతుందని చెప్పారు. కాంటాక్ట్ లిస్ట్ లో పేరును సేవ్ చేయకుండానే ఈజీగా నంబర్ తోనే గ్రూప్ క్రియేట్ చేయొచ్చని వివరించారు.
వినియోగదారులు త్వరితగతిన గ్రూప్ ను క్రియేట్ చేయాలనుకొన్నప్పుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. పేరులేని గ్రూప్ లో పేరు లేకుండా ఆరుగురిని యాడ్ చేయొచ్చు. గ్రూప్లో ఉన్న వారి పేర్లు డైనమిక్‌గా పెట్టబడతాయని గమనించాలి. ఈ ఫీచర్ వ్యక్తుల ప్రైవసీకి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తుంది. గ్రూప్ లోని ప్రతి పార్టిసిపెంట్‌కు గ్రూప్ పేరు భిన్నంగా కనిపిస్తుందని వాట్సాప్ తెలిపింది. వారు తమ ఫోన్‌లో కాంటాక్ట్‌లను ఎలా సేవ్ చేసుకున్నారనే దాని ఆధారంగా ఈ పేరు ఉంటుంది. ఒకవేళ్ల మీ
మీ కాంటాక్ట్ సేవ్ చేయని వ్యక్తులు మిమ్మల్ని గ్రూప్‌లోకి యాడ్ చేస్తే, గ్రూప్ పేరుగా మీ ఫోన్ నంబర్ కనిపిస్తుంది.
ప్రైవసీకి అధిక ప్రాధాన్యం..
కాగా ఇటీవల వాట్సాప్ తన లేటెస్ట్ ప్రైవసీ ఇనిషియేటివ్ 3డీ అనామోర్ఫిక్ ఇన్ స్టాలేషన్ ను ముంబైలోని ఇండియా గేట్ వద్ద ఆవిష్కరించింది. ఇక్కడ ఏర్పాటు చేసిన మొదటి 3డీ అనామోర్ఫిక్ ఇన్ స్టాలేషన్ వాట్సాప్ గోప్యతా లేయర్‌లు ఎలా కలిసి పనిచేస్తాయో చూపిస్తుంది. సృజనాత్మక కథనాలను, హైపర్‌లోకల్ చిహ్నాలను ఉపయోగించి ప్రైవేట్ మెసేజింగ్ కోసం సురక్షితమైన స్థలాన్ని సృష్టిస్తుంది. ముంబై నగరం కాలీ-పీలీ టాక్సీ, రెడ్ పోస్ట్ బాక్స్, ఐకానిక్ స్ట్రీట్ ల్యాంప్స్, గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద ఉన్న పావురాలు వంటి చిహ్నాలను వినియోగిస్తుంచి అద్భుతమైన మెసేజింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, టూ స్టెప్ వెరిఫికేషన్, తెలియని కాలర్‌లను నిశ్శబ్దం చేయడం, అదృశ్యమవుతున్న సందేశాలు వంటి లక్షణాలను ఈకొత్త ఇన్ స్టాలేషన్ హైలైట్ చేస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..