Whatsapp New Feature: మెసేజ్‌ల ఫార్వర్డ్‌ విషయంలో వాట్సాప్‌ సంచలన నిర్ణయం.. ఇక నుంచి అలా ఉండదు..!

|

Apr 04, 2022 | 7:53 AM

Whatsapp New Feature: వాట్సాప్‌.. ఇది తెలియని వారుండరు. ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఎంతో మంది వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. వాట్సాప్‌ చాటింగ్‌లు,..

Whatsapp New Feature: మెసేజ్‌ల ఫార్వర్డ్‌ విషయంలో వాట్సాప్‌ సంచలన నిర్ణయం.. ఇక నుంచి అలా ఉండదు..!
Follow us on

Whatsapp New Feature: వాట్సాప్‌.. ఇది తెలియని వారుండరు. ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఎంతో మంది వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. వాట్సాప్‌ చాటింగ్‌లు, స్టేటస్‌ ఇలా తదితర పనులలో బిజీగా ఉంటారు. చిన్నా నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు వాట్సాప్‌ (Whatsapp) ఉపయోగిస్తుంటారు. ఇక అందకు తగినట్లుగానే వాట్సాప్‌ సంస్థ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్స్‌ (Features)ను అందుబాటులో తీసుకువస్తుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఫార్వర్డ్‌ మెసేజ్‌లను ఒకసారి మాత్రమే ఫార్వర్డ్‌ (Forward) చేసేలా మార్పులను తీసుకువస్తోంది. అది గ్రూప్‌ కానివ్వండి.. పర్సనల్‌గా కానివ్వండి.. సాంకేతికంగా మార్పులు తీసుకువస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. వాబీటాఇన్ఫో తెలిపిన వివరాల ప్రకారం.. వాట్సాప్‌ బీటా ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 22.2.7.2, ఐఫోన్‌ 22.7.0.76 వెర్షన్‌లలో ఈ కొత్త మార్పులు తీసుకువస్తున్నట్లు తెలిపింది.

ఒక మెసేజ్‌ను ఒకటి కంటే ఎక్కువ గ్రూపులు, వ్యక్తులకు త్వరగా ఫార్వర్డ్‌ చేయడం వీలుకాదు. ఒక వేళ ఫార్వర్డ్‌ చేయాలని అనుకుంటే తిరిగి మెసేజ్‌ను ఎంచుకుని ఫార్వర్డ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది ఇప్పటికే కొన్ని ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌లో ప్రవేశపెట్టగా, మరికొన్ని ఆండ్రాయిడ్‌ వెర్షన్లలోనూ పరీక్షిస్తున్నట్లు తెలిపింది. కాగా, ప్రస్తుతం వాట్సాప్‌లో ఒకేసారి ఐదుగురికి గానీ, ఐదు గ్రూపులకు ఫార్వర్డ్‌ చేసే సదుపాయం ఉంది. ఈ కొత్త నిబంధనలు వస్తే ఒకేసారి ఫార్వర్డ్‌ చేసే వీలుంటుంది.

ఇవి కూడా చదవండి:

Aadhaar Mobile Number: మీ ఆధార్‌కు ఏ మొబైల్‌ నంబర్‌ లింక్‌ చేశారో తెలియడం లేదా..? సులభంగా తెలుసుకోవచ్చు..!

Glue: జిగురు బాటిల్‌ లోపల ఎందుకు అంటుకోదు.. దీనికి కారణం ఏమిటి..?

Check Payment: చెక్‌ పేమెంట్లపై ఆ బ్యాంకు కీలక నిర్ణయం.. నేటి నుంచి కొత్త నిబంధనలు అమలు..!