Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ ఇబ్బందులు తీర్చేందుకు సరికొత్త ఫీచర్

|

Apr 02, 2022 | 7:13 AM

నిత్య జీవితంలో వాట్సాప్(Whatsapp) ఒక భాగమైంది. ఎన్నో పనులు ఇప్పుడు వాట్సాప్ వేదికగానే జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు కాంటాక్ట్ లిస్ట్(Contact List) లో సేవ్ అయిన నంబర్లతోనే ఛాటింగ్ చేసే అవకాశం ఉంది. ఛాటింగ్...

Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ ఇబ్బందులు తీర్చేందుకు సరికొత్త ఫీచర్
Whatsapp
Follow us on

నిత్య జీవితంలో వాట్సాప్(Whatsapp) ఒక భాగమైంది. ఎన్నో పనులు ఇప్పుడు వాట్సాప్ వేదికగానే జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు కాంటాక్ట్ లిస్ట్(Contact List) లో సేవ్ అయిన నంబర్లతోనే ఛాటింగ్ చేసే అవకాశం ఉంది. ఛాటింగ్(Chatting) చేయాలంటే ఆ నంబర్ ను సేవ్ చేసుకోవడం తప్పనిసరి. ఇలా చేయడం కొన్ని కొన్ని సార్లు చికాకు తెప్పిస్తాయి. ఇలాంటి వారి ఇబ్బందులు తొలగించేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. అదేంటంటే.. కాంటాక్ట్ లిస్ట్ లో నంబర్ సేవ్ చేయకుండానే ఛాటింగ్, కాల్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని వాట్సాప్ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే వాయిస్‌ మెసేజ్‌లో ఆరు కొత్త ఫీచర్లతో పాటు, మల్టీడివైజ్‌ సపోర్ట్‌, ఇమేజ్‌ ఎడిట్‌ వంటి ఫీచర్లను ఈ ఏడాదిలో తీసుకొచ్చింది. త్వరలో చాట్ పేజీలో తీసుకురానున్న కొత్త ఫీచర్‌తో యూజర్స్‌ వాట్సాప్‌లో ఏదైనా ఫోన్ నంబర్‌ షేర్‌ చేసిన తర్వాత, రిసీవర్‌ సదరు ఫోన్‌ నంబర్‌పై క్లిక్ చేస్తే పాప్‌-అప్‌ మెనూ ప్రత్యక్షమవుతుంది. అందులో చాట్‌, డయల్‌, యాడ్‌ కాంటాక్ట్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. దీంతో యూజర్‌ సదరు ఫోన్‌ నంబర్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో సేవ్‌ చేయకుండానే చాట్ చేయొచ్చు. అలానే డయల్‌ ఆప్షన్‌ ద్వారా సదరు వ్యక్తికి కాల్ చేసి మాట్లాడొచ్చు.

గతంలో వాట్సాప్‌లో చాట్ చేయాలంటే ఫోన్‌ నంబర్‌ తప్పనిసరిగా కాంటాక్ట్స్‌ లిస్ట్‌ చేసుకోవాల్సిందే. త్వరలో తీసుకురానున్న పాప్‌-అప్‌ మెనూ అప్‌డేట్‌తో ఈ ప్రక్రియ సులభతరం కానుంది. అలానే వాట్సాప్‌ వ్యూవన్స్‌ ఫీచర్‌ను త్వరలోనే విండోస్‌ యూజర్లకు కూడా పరిచయం చేయనుంది. ఇవేకాకుండా వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్లకు 37 కొత్త ఎమోజీలను పరిచయం చేయనుంది. ఇందులో మెల్టింగ్‌ ఫేస్‌, ఆఫ్‌ ఫేస్‌ సెల్యూట్, డాటెడ్‌ లైన్‌ ఫేస్‌ ఇలా దాదాపు 37 ఎమోజీలు ఉన్నాయి.

Also Read

Rachakonda Police: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న వారికి ఉచిత కోచింగ్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

Viral Video: వామ్మో.. అదేంటి గురూ అలా తిప్పేశావ్..! వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

Ramzan 2022: ఉపవాసం ఉండాలనుకుంటున్నారా..? ఇవి తింటే రోజంతా ఉత్సాహంగా ఉండోచ్చు..