నిరంతరం కొత్త ఫీచర్‌తో యూజర్లకు అనేక సౌకర్యాలను తెచ్చిపెడుతోంది ఇన్స్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. కేవలం మెజేసులు పంపుకొనే ఆప్షన్ నుంచి ఫోన్‌లో కాలింగ్, వీడియో కాలింగ్, ఫార్వర్డ్ మెసేజ్, వ్యూ వన్స్ లాంటి ఇతర ఎన్నో ఆప్షన్లను తీసుకొస్తూ యూజర్లలో నిరంతరం ఆసక్తి రేకెత్తిస్తోంది. మొబైల్ ఫోన్‌కే పరిమితమైన యాప్‌ను డెస్క్‌టాప్ మీద వాడుకొనే వీలు కల్పించింది. అయితే అందులో ఇప్పటి వరకు కేవలం సందేశాలు పంచుకొనే వీలు ఉండేది. కానీ, కరోనా లాక్‌డౌన్ వల్ల చిన్న, పెద్ద సంస్థలన్నీ తమ సిబ్బంది ఇంటి నుంచే పనిచేసే వీలును కల్పించింది. దీంతో పనిలో ఎలాంటి క్షీణత ఉండకూడదని ప్రతి రోజూ వీడియో మీటింగులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీంతో అప్పటి వరకు పెద్దగా పరిచయం లేని వీడియో కాలింగ్, గ్రూప్ కాలింగ్ యాప్‌లకు ఒక్కసారిగా డౌన్‌లోడ్స్ పెగిరిపోయాయి. దీంతో డెస్క్‌టాప్‌లకు సపోర్ట్ చేసే వీడియో కాలింగ్ యాప్స్‌కు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో మార్కెట్‌లోకి కొత్త యాప్‌లు పుట్టుకొచ్చాయి.
ఆలోటును కూడా పూడ్చుకుందామనే..
ఈ నేపథ్యంలో ఉన్న లోటును పూడ్చుకోవడానికి వాట్సాప్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇకపై ఫోన్‌కే పరిమితమైన కాలింగ్, వీడియో కాలింగ్ ఆప్షన్‌ను ఇక నుంచి వాట్సాప్ డెస్క్‌టాప్ వర్షన్‌లో కూడా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి డెస్క్‌టాప్ వెర్షన్ యాప్‌లో కూడా వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి విండోస్ 10 64-బిట్ వెర్షన్ 1903 లేదా కొత్త, మ్యాక్ ఓఎస్ 10.13 లేదా కొత్త వెర్షన్‌లలో మాత్రమే వీడియో కాల్ సపోర్ట్ అందుబాటులో ఉంది. ఇక వెబ్ వాట్సాప్‌లో కూడా వీడియో కాలింగ్ సౌకర్యాన్ని కల్పించాలని యూజర్లు కోరుకుంటున్నారు. అదే జరిగితే వెబ్ వాట్సాప్ వాడకం భారీగా పెరిగే అవకాశం ఉంది.